తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Unhealthy Signs: ఉదయం నిద్రలేచాక ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు, ఇవి కొన్ని వ్యాధుల సంకేతాలు

Morning Unhealthy Signs: ఉదయం నిద్రలేచాక ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు, ఇవి కొన్ని వ్యాధుల సంకేతాలు

Haritha Chappa HT Telugu

30 August 2024, 10:41 IST

google News
  • Morning Unhealthy Signs: ఉదయం నిద్రలేచిన తర్వాత, మీకు ఫ్రెష్ గా అనిపించకపోతే  అది మీ మానసిక స్థితి సరిగా లేదని చెప్పే సంకేతం. అలాగే మరికొన్ని లక్షణాలు కనిపించినా కూడా ఇవి వ్యాధుల సంకేతాలుగానే భావించాలి.

ఉదయం నిద్రలేచాక కనిపించే లక్షణాలు
ఉదయం నిద్రలేచాక కనిపించే లక్షణాలు (pixabay)

ఉదయం నిద్రలేచాక కనిపించే లక్షణాలు

అనారోగ్యానికి గురికావడానికి ముందే మన శరీరం మనకు కొన్ని రకాల సంకేతాల ద్వారా ఆ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తుంది. సరైన సమయంలో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అనేక రకాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవనచ్చు. ఇందుకు మీరు ఉదయం లేచాక మీ శరీరంలో కనిపించే లక్షణాలను గుర్తించాలి.

ఉదయం లేవగానే తరచుగా శరీరంలో అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి. ఇది సాధారణం అనుకోకండి, కొన్ని వ్యాధుల వల్ల ఇలా జరుగుతుంది. మీరు కూడా ఉదయాన్నే ఈ 6 రకాల లక్షణాలను అనుభవిస్తే, వాటి వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి.

నిద్రలేచిన తర్వాత గొంతులో దురద, దగ్గు అనిపిస్తే లేదా నిద్రలేవగానే దగ్గు ప్రారంభమైతే ఇవి టాన్సిల్స్ లేదా అలెర్జీల లక్షణాలుగా భావించాలి.

మూడ్ బాగోలేదంటే

నిద్రలేచిన తరువాత ఎవరికైనా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఉత్సాహంగా ఉంటుంది. మీకు ఉదయం లేచాక మూడ్ బాగోలేకపోతే, ఏ పనీ చేయాలనిపించకపోతే అది నిద్రలేమి, డిప్రెషన్, విటమిన్ డి3 లోపం వల్ల కలుగుతుందని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఉదయం లేచాక మూడ్ బాగోదు. అటువంటి పరిస్థితిలో ప్రాణాయామం సహాయంతో దీనిని నియంత్రించవచ్చు.

మీకు రాత్రి బాగా నిద్రపట్టాక కూడా ఉదయం లేవగానే తలలో పదునైన నొప్పి, అనిపిస్తే, ఇది ఒత్తిడి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే, సైనస్ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు అధిక రక్తపోటు వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ఒళ్లు నొప్పులు వస్తే…

పొద్దున్నే ఒళ్లు నొప్పులు ఉంటే పోషకాల లోపాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు ఇది ఫైబ్రోమైయాల్జియాకు కారణం అవుతుంది. శరీరం చాలా సున్నితంగా అనిపించి కీళ్లు, కండరాల్లో నొప్పి ఉండే పరిస్థితి ఇది.

ఉదయం నిద్రపోయి లేచాక మైకంగా, మత్తుగా అనిపిస్తే అది హైపోటెన్షన్ లేదా రక్తహీనత వల్ల సంభవిస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్ సమస్య మీకుంటే ఉదయం మేల్కొన్న తర్వాత, మీకునోటిలో లోహ వింత రుచి కలుగుతుంది. కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఐరన్, క్యాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నా నోటిలో ఇలా వింత రుచి వస్తుంది.

ఉదయాన లేచాక కళ్ల మసకగా కనిపించడం కూడా కొన్ని రకాల సమస్యలకు సంకేతాలే. కళ్లు పొడి బారిపోవడం, ఒత్తిడి, కంటి అలెర్జీలు వంటి సమస్యలు ఉన్న వారిలో నిద్రపోయిన లేచాక కూడా కళ్లు మసకబారే సమస్య కనిపిస్తుంది.

కొంతమంది ఉదయం లేచాక కళ్లు తిరిగినట్టు ఫీలవుతారు. వారిలో తల తిరగడం అనే సమస్య కనిపిస్తుంది. దీనికి లోబీపీ కారణం కావచ్చు. అలాగే డీ హైడ్రేషన్, గుండె సమస్యలు, రక్తం గడ్డ కట్టడం, అడ్రనలిన్ హార్మోను సరిగా పనిచేయకపోవడం, విటమిన్ బి12 లోపించ వంటి సమస్యల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం