Rubbing Palms: ప్రతిరోజూ ఉదయం కాసేపు అరచేతును రుద్దండి, దీనివల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు
Rubbing Palms: అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అరచేతులను కలిపి రుద్దడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రోజూ కాసేపు చేతులు రుద్దడం వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
అనారోగ్యంతో ఉన్నవారి చేతులు, కాళ్ళను రుద్దడం చూసే ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు చేస్తారో? అలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై ఏదైనా ప్రభావం చూపిస్తుందా? కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని ఆయుర్వదేం ధ్రువీకరిస్తోంది. ఆయుర్వేదం, యోగా రెండింటిలోనూ, అరచేతులను కాసేపు రుద్దడం ఎంతో మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం లేచాక కాసేపు అరచేతులను రుద్దండి. ఆ రుద్దిన అరచేతులను మధ్యమధ్యలో కళ్ల మీద పెట్టుకుంటూ ఉండండి. మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
అరచేతులను కలిపి రుద్దడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరంలో ప్రతి అవయవానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రోజూ కాసేపు చేతులు కలిపి రుద్దడం, వాటిని కళ్లపై ఉంచుకోవడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఆక్యుప్రెషర్ పాయింట్లు
ఒక వ్యక్తి అరచేతులలో అనేక చోట్ల ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక భాగాలతో అనుసంధానించి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, చేతులు కలిపి రుద్దినప్పుడు, చేతులలో వేడి, శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల రక్తం శరీరమంతా బాగా ప్రసరిస్తుంది.
కంటి ఆరోగ్యం
రెండు చేతులను కలిపి రుద్దడం కంటి ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. నిజానికి అరచేతుల వెచ్చదనం కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది అలసిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కాసేపు అరచేతులను రుద్ది ఆ చేతులను కళ్లపై ఉంచుకుంటూ ఉండండి. కంటికి ఎంతో మేలు జరుగుతుంది.
మెరుగైన రక్త ప్రసరణ
అరచేతులను కలిపి రుద్దడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీని వల్ల శరీరం వేడిని పొందుతుంది. ఆ వ్యక్తి చురుకుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మెదడు పనితీరు
చేతులను రుద్దిన తర్వాత కళ్ళకు అప్లై చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇలా చేయడం వల్ల వ్యక్తి మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయని, రోజంతా పాజిటివిటీతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటాడని చెబుతారు. కాబట్టి మెదడు కోసమైనా ప్రతిరోజూ ఈ పని మీరు చేయాలి.
జలుబును
చలికాలంలో చల్లని చేతులను కలిపి రుద్దుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది, ఇది వ్యక్తికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.
టాపిక్