Chapati Dough : చపాతీ పిండిని ఫ్రిజ్‍లో పెడుతున్నారా? అయితే ఇబ్బందులే
18 November 2023, 11:00 IST
- Chapati Dough In Fridge : చపాతీ పిండిని కలిపాక ఫ్రిజ్‍లో పెట్టడం చాలా మందికి అలవాటు. ఈ పద్ధతి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
చపాతీ పిండి
చాలా మంది చపాతీ తినడానికి ఇష్టపడతారు. కొందరు చపాతీ పిండిని మెత్తగా కలుపుకొని, తర్వాత చేద్దాంలేనని బద్ధకంగా ఉంటారు. అందుకని ముందుగా మెత్తగా కలిపి.. ఇంట్లో తమ ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటారు. ఇలా మీరు కూడా చపాతీ పిండిని ఫ్రిజ్ లో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
చపాతీ పిండిని ఫ్రిజ్‍లో పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. చలికాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి, అటువంటి పరిస్థితులలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా మన శరీరంలోని జీవక్రియను ఉత్తేజపరచవచ్చు. అందుకే కొన్ని విషయాల్ల జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఫ్రిజ్‍లో పెట్టిన చపాతీ పిండి.. మీకు తెలియని మార్గాల్లో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చపాతీ పిండిని మెత్తగా చేసి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
చపాతీ పిండిని కలిపి.. ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడవుతుంది. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. చపాతీ పిండిని చాలా మంది రెండు మూడు రోజులకు సరిపడేలా ఒకేసారి కలుపుకొంటారు. అటువంటి పరిస్థితిలో చెడిపోకుండా ఉండటానికి తరచుగా దానిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ నిజానికి ఇలా చేస్తే.. పిండి చెడిపోయే ప్రమాదం ఇక్కడ నుండి పెరుగుతుంది. పిండిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది మీరు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఉంది. ఇలా పిండి పాడయ్యే.. విషయం బయటకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ లోలోపల చర్య జరుగుతూనే ఉంటుంది.
లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీకు చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్‍కు కారణమవుతుంది. వాస్తవానికి, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీరు రిఫ్రిజిరేటర్లో ఉంచడం ద్వారా పిండిని కాపాడుకోవాలనుకుంటే కుదరదు. అందులో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మరింత ప్రమాదం.
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచడానికి సరైన మార్గం ఏంటంటే, మీరు నిజంగా ఉపయోగించిన తర్వాత పిండి మిగిలిపోయి ఫ్రిజ్‌లో ఉంచాలనుకుంటే, చపాతీ పిండిని కలుపుతున్నప్పుడు తక్కువ నీరు ఉపయోగించండి. ఎందుకంటే పిండిలో నీరు ఎక్కువగా ఉంటే పాడైపోతుంది. అలాగే చపాతీ పిండిని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టి రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. అలా అయితే కాస్త సేఫ్. నిజానికి ఫ్రిజ్‍లో పెట్టుకోకపోవడమే మంచిది.
టాపిక్