Chapati Upma : రాత్రి మిగిలిపోయిన చపాతీతో ఉప్మా.. చేయడం చాలా ఈజీ-today breakfast recipe how to make upma with left over chapati simple tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chapati Upma : రాత్రి మిగిలిపోయిన చపాతీతో ఉప్మా.. చేయడం చాలా ఈజీ

Chapati Upma : రాత్రి మిగిలిపోయిన చపాతీతో ఉప్మా.. చేయడం చాలా ఈజీ

Anand Sai HT Telugu
Oct 25, 2023 06:00 AM IST

Leftover Chapati Recipe : రోజూ రాత్రి భోజనానికి చపాతీ తయారు చేసి తినడం చాలా మందికి అలవాటు. కానీ కొన్నిసార్లు చపాతీలు మిగిలిపోతాయి. పొద్దున్నే తినడానికి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి? తిండి వృథా చేయాలని అనిపించకపోతే మీకోసం బెస్ట్ ఐడియా ఉంది. చపాతీలతో టేస్టీ ఉప్మా చేసుకోవచ్చు.

చపాతీతో ఉప్మా
చపాతీతో ఉప్మా

ఆహారాన్ని పారేయకూడదనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఏం చేయాలో కొన్నిసార్లు అర్థంకాదు. ఎంత ట్రై చేసినా ఆహారాలు మిగులుతాయి. రాత్రి భోజనానికి తయారుచేసిన చపాతీ మిగిలి ఉంటే ఉదయం తినడానికి కొందరు ఇష్టపడను. అలా అని బయట పారేయకూడదు. ఈ చపాతీతో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన చపాతీతో ఉప్మా తయారు చేయెుచ్చు. దీనిలో కొన్ని కూరగాయలను కలుపుకోవచ్చు. ఉల్లిపాయ, టొమాటోతో చపాతీ ఉప్మా చేస్తే వావ్ అంటూ తింటారు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:

చపాతీ - 4

ఉల్లిపాయ - 1

టొమాటో - 1

క్యారెట్ - 1

క్యాప్సికమ్ - సగం

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ½ టీస్పూన్

ధనియాల పొడి - ½ టీస్పూన్

గరం మసాలా - ½ tsp

కొత్తిమీర - కొద్దిగా

రుచికి ఉప్పు

కరివేపాకు - కొద్దిగా

నూనె - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - ½ tsp

జీలకర్ర - 1/2 tsp

తయారుచేసే విధానం

ముందుగా చపాతీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుని కాసేపు తిప్పాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి. తరవాత టొమాటో వేసి, మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేయండి. అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి.

మళ్ళీ మూత మూసివేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు తరిగిన చపాతీ ముక్కలను వేయాలి. చివరగా గరం మసాలా, కరివేపాకు వేసి బాగా కలపాలి. చపాతీ ఉప్మా గట్టిగా అనిపిస్తే.. కావాలంటే కొన్ని నీరు పోసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తరుగు చల్లాలి. ఇప్పుడు రుచికరమైన చపాతీ ఉప్మా రెడీ.

Whats_app_banner