Immunity Boosting Soups । మెరుగైన ఇమ్యూనిటీ కోసం న్యూట్రిషనిస్టులు సిఫారసు చేసిన సూప్‌లు ఇవే!
27 December 2022, 23:24 IST
- Immunity Boosting Soups: చలికాలంలో సీజనల్ వ్యాధులు, కరోనా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం శరీరానికి బలమైన రోగనిరోధక శక్తి అవసర. ఇక్కడ న్యూట్రిషనిస్టులు సిఫారసు చేసిన కొన్ని సూప్‌ల రెసిపీలు ఉన్నాయి.
Immunity Boosting Soups
Immunity Boosting Soups: ఇంట్లో తయారుచేసిన సూప్ డిన్నర్ సమయంలో, భోజనాల మధ్య తీసుకునే ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం. ముఖ్యంగా చలికాలంలో, ఈ సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా కాలానుగుణంగా వచ్చే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది కాబట్టి, మనం తక్కువ నీరు తాగుతాం. అయితే ఈ సూప్‌లు మీ శరీరానికి అవసరమయ్యే నీటి శాతాన్ని భర్తీ చేస్తాయి. ఆకలని తీర్చి అతి ఆకలిని నిరోధిస్తాయి, తద్వారా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటాం, జీర్ణక్రియకు కూడా సూప్‌లు చాలా మంచివి. వివిధ కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ సూప్‌లు మంచి పోషకాలను శరీరానికి అందిస్తాయి.
సూప్‌లు చాలా రకాలు ఉంటాయి, వీటిలో ఉపయోగించే పదార్థాలను బట్టి ఇవి మీ శరీరానికి కావలసిన అవసరాలను తీరుస్తాయి. ఈ చలికాలంలో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. వీటన్నింటిని తట్టుకునేలా మీకు శక్తిని అందించే కొన్ని అద్భుతమైన సూప్‌లను పూణేలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ శ్రుతి కేలుస్కర్ తెలియజేశారు. ఆ సూప్ వెరైటీలు ఏంటి? వాటి రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
Roasted Red Pepper Tomato Soup Recipe- కోసం కావలసినవి
- 290 గ్రా కాల్చిన రెడ్ క్యాప్సికమ్
- 270 గ్రా చెర్రీ టమోటాలు (అందుబాటులో లేకపోతే సాధారణ టమోటాలు )
- 1 వెల్లుల్లి
- 1 వెజెటెబుల్ స్టాక్ క్యూబ్
- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
- 4 టేబుల్ స్పూన్లు బాదం పొడి
రోస్టెడ్ రెడ్ పెప్పర్ టొమాటో సూప్ తయారీ విధానం
- బ్లెండర్లో టొమాటోలతో పాటు, కాల్చిన రెడ్ క్యాప్సికమ్ వేయండి.
- ఆపైన వెల్లుల్లి, కూరగాయల స్టాక్ క్యూబ్, 100 ml నీరు, ఆలివ్ నూనె, బాదం పొడి వేసి బాగా నునుపుగా మ్మారేంత వరకు రుబ్బండి.
- ఇప్పుడు ఈ ద్రావణాన్ని పొగలు వచ్చేంత వరకు వేడి చేయండి. రోస్టెడ్ రెడ్ పెప్పర్ టొమాటో సూప్ రెడీ.
Broccoli Vegan Cream Soup Recipe కోసం కావలసినవి
2 చిన్న ఉల్లిపాయల ముక్కలు
4 లవంగాలు తరిగిన
1 క్యారెట్ ముక్కలు
4 కప్పుల బ్రోకలీ ముక్కలు
2 కప్పుల కూరగాయల స్టాక్
1 కప్పు బాదం పాలు
1 స్పూన్ నూనె
బ్రోకలీ వేగన్ క్రీమ్ తయారీ విధానం
- బాణలిలో తరిగిన క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిని వేసి వేయించాలి.
- ఇప్పుడు కొన్ని చెంచాల కూరగాయల స్టాక్ వేసి, కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి
- ఉడికేటపుడు బ్రోకలీ, బాదం పాలు, మిగిలిన కూరగాయల స్టాక్ వేసి మీడియం మంట మీద ఉడకనివ్వండి
- కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించి, ఆపైన చల్లబరిచి ఈ సూప్‌ను బ్లెండర్‌లో పోసి మృదువుగా వచ్చేంత వరకు మిక్స్ చేయండి.
- వేడి పాన్‌లో సూప్‌ను తిరిగి పోసి నిమిషం పాటు ఉడికించాలి
- కారం, ఉప్పు వేస్తే బ్రోకలీ వేగన్ క్రీమ్ సూప్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
Tangy Carrot- Beetroot Soup- కోసం కావలసినవి
- 1 స్పూన్ నెయ్యి
- 1 క్యారెట్
- 1 బీట్‌రూట్
- 2 కప్పుల నీరు
- 1 స్పూన్ నిమ్మరసం
- 1/2 టీస్పూన్ అల్లం
- చిటికెడు పసుపు
- 2-3 మిరియాలు
- 2- ఏలకులు
- కొన్ని సోంఫ్ విత్తనాలు
టాంగీ క్యారెట్- బీట్‌రూట్ సూప్ తయారీ విధానం
- ముందుగా ఒక పాన్‌లో నెయ్యి వేసి, అల్లం సహా మిగతా అన్ని మసాలా దినుసులను వేసి 1 నిమిషం పాటు వేయించాలి.
- ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి క్యారెట్, బీట్‌రూట్ ముక్కలు వేసి మీడియం మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి.
- అనంతరం చల్లబరిచి, మిక్సర్ లో ఈ సూప్‌ను ప్యూరీలాగా తయారు చేయండి.
- చివర్లో ఈ బ్లెండెడ్ సూప్‌ను మళ్లీ వేడి చేసి నిమ్మకాయ రసం పిండి వేడిగా సర్వ్ చేయండి.