Steamed Lentil Dumplings । చలికాలంలో వేడి వేడి ఆవిరి కుడుములు.. ఆరోగ్యకరమైన అల్పాహారం!-steamed lentil dumplings a perfect breakfast for winters check nuchinde recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Steamed Lentil Dumplings । చలికాలంలో వేడి వేడి ఆవిరి కుడుములు.. ఆరోగ్యకరమైన అల్పాహారం!

Steamed Lentil Dumplings । చలికాలంలో వేడి వేడి ఆవిరి కుడుములు.. ఆరోగ్యకరమైన అల్పాహారం!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 07:17 AM IST

పప్పు ధాన్యాలతో ఆవిరిమీద కుడుములు చేసుకుంటే చలికాలపు ఉదయాన అద్భుత అల్పాహారంగా ఉంటాయి. Steamed Lentil Dumplings ఇక్కడ ఉంది, మీరూ ప్రయత్నించండి.

Steamed Lentil Dumplings
Steamed Lentil Dumplings (Slurrp)

మనకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రతిరోజూ ఒక వెరైటీ తినాలని కోరుకుంటాం. సాంబార్ ఇడ్లీ, మసాల దోశ, పూరీ కుర్మా, మైసూర్ బజ్జీ లేదా ఉప్మా ఇవన్నీ మనం ఎప్పుడూ తినేవే. ఇంకాస్త కొత్తగా కోరుకుంటే మీరు నుచ్చినుండే అల్పాహారాన్ని (Nuchinunde Dumplings) ప్రయత్నించవచ్చు. ఈ నుచ్చినుండే అనేది పప్పుధాన్యాలతో చేసే కుడుములు, వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు.

ఈ ఆవిరి కుడుము (steamed lentil dumplings) లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన, సాంప్రదాయ అల్పాహార వంటకం. కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు. పిండి, నూనెలు లేకుండా చేయడం వలన ఇవి ఉదయం వేళ చాలా తేలికైన అల్పాహారంగా ఉంతాయి. ముఖ్యంగా వారంతంలో విందులు ఎక్కువగా జరుగుతాయి, ఆ తర్వాత కడుపు శుద్ధి జరగాలంటే కాస్త తేలికైనవి అల్పాహారాలు తినాలి. అందుకు ఈ పప్పు కుడుములు అద్బుతంగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, తయారీ విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. మరి మీరూ ఈ ఆవిరి పప్పు కుడుములు తినాలనుకుంటే నుచ్చినుండే రెసిపీ ఇక్కడ ఇచ్చాం, ఇలా ఒకసారి ప్రయత్నించండి.

Steamed Lentil Dumplings- Nuchinunde Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు కందిపప్పు
  • 1/2 కప్పు శనగపప్పు
  • 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • 1/2 కప్పు కొత్తిమీర
  • 1 టేబుల్ స్పూన్ అల్లం
  • 2 పచ్చి మిరపకాయలు
  • చిటికెడు ఇంగువ
  • రుచి ప్రకారం ఉప్పు

పప్పు ఆవిరి కుడుములు- నుచ్చినుండే రెసిపీ తయారీ విధానం

  1. ముందుగా కందిపప్పు, శనగపప్పులను ఒక గిన్నెలో కొద్దిసేపు నానబెట్టాలి.
  2. పప్పులు కొద్దిగా మెత్తబడ్డాక వాటిని ఒక గ్రైండర్ లో వేసి, కొన్ని నీళ్లు పోసి మందపాటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమమంలో కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పువేసి బాగా కలిపి ముద్దలుగా చేయాలి.
  4. ఇప్పుడు ఈ కుడుముల ముద్దలను ఒక స్టీమర్‌లో ఉంచి దాదాపు 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

అంతే వేడివేడి ఆవిరి కుడుములు రెడీ, పచ్చిమిర్చి పచ్చడి, రెడ్ చట్నీ అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్