తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber Curry Recipe । వేసవిలో దోసకాయ కూర తింటే ఉల్లాసం, ఉత్సాహం!

Cucumber Curry Recipe । వేసవిలో దోసకాయ కూర తింటే ఉల్లాసం, ఉత్సాహం!

HT Telugu Desk HT Telugu

06 March 2023, 13:47 IST

google News
    • Cucumber Curry Recipe: దోసకాయలో పోషకాలు, ఫైబర్, నీరు పుష్కలంగా లభిస్తుంది. ఎండాకాలంలో ఇది తప్పకుండా తినాలి. దోసకాయతో రైతా, సలాడ్స్ చేసుకోవడం మీకు తెలిసిందే. దోసకాయ కూర రెసిపీని ఇక్కడ చూడండి.
Cucumber Curry Recipe
Cucumber Curry Recipe (slurrp)

Cucumber Curry Recipe

ఎండాకాలం మొదలైందంటే మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ వేడి సీజన్ లో వేడివేడిగా ఏదీ తినాలనిపించదు. మాంసం కూరలు, మసాలా వేపుళ్లు తగ్గించడం మంచిది. వీటితో జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపుకు చలువ చేసే ఆహార పదార్థాలు, నీటి శాతం- పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అలాంటి ఒక రెసిపీని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

ఈ వేసవిలో దోసకాయను చాలా మంది తింటారు, తప్పకుండా తినాలి కూడా. దోసకాయను నేరుగా తినవచు, కూరల్లో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, కూరగా కూడా వండుకోవచ్చు. దోసకాయ కూర ఈ వేసవిలో మీరు కచ్చితంగా ప్రయత్నించాలి. ఇది ఎంతో రుచిగా ఉండటంతో పాటు, మీకు నిర్జలీకరణ సమస్యను దూరం చేస్తుంది. దోసకాయ కూర రెసిపీ ఈ కింద ఉంది. ఇక్కడ సూచించినట్లుగా సులభంగా వండుకోవచ్చు.

Cucumber Curry Recipe కోసం కావలసినవి

  • 2 పొడవాటి దోసకాయలు
  • 2 ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి
  • 400ml కొబ్బరి పాలు
  • 1 స్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ ధనియాలు
  • 1/2 స్పూన్ మెంతులు
  • 1/2 టీస్పూన్ సోంపు
  • 1/2 tsp కారం పొడి
  • 1/2 స్పూన్ పసుపు
  • 1 చిన్న దాల్చిన చెక్క ముక్క
  • 7- 8 కరివేపాకులు
  • 50ml పొద్దు తిరుగుడు నూనె
  • రుచికి తగినంత ఉప్పు

దోసకాయ కూర రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగండి, ఆపై వాటిని నిలువుగా చీల్చి అందులోని విత్తనాలను తీసివేయండి, ఆ తర్వాత దోసకాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు ఒక పెనం వేడి చేసి దానిపై జీలకర్ర, ధనియాలను సుగంధం వచ్చేవరకు దోరగా వేయించండి. ఆపైన చల్లబరిచి పొడిగా రుబ్బుకోవాలి. ఇందులోనే పసుపు, కారం పొడిని కలపాలి
  3. ఇప్పుడు బాణాలిలో కొన్ని నీళ్లు వేడి చేసి అందులో దోసకాయ ముక్కలు వేయండి, ఆపైన కొబ్బరి పాలు, రుబ్బిన మసాలా మిక్స్, పచ్చి మిరపకాయలు, దాల్చినచెక్కను వేసి దోసకాయలు మెత్తబడే వరకు 10 నిమిషాలు ఉడికించండి. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా జీడిప్పపు కూడా వేసుకోవచ్చు.
  4. ఈలోపు మరొక పాన్‌లో పొద్దుతిరుగుడు నూనెను వేడి చేసి, వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మెంతులు, సోపు వేసి మీడియం వేడి మీద 5 నిమిషాలు వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఈ పోపును దోసకాయ కూర మిశ్రమంలో వేసి, రుచికి తగినంత ఉప్పు కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించండి.

అంతే, రుచికరమైన దోసకాయ కూర రెడీ. దీనిని అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం