తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Poses For Sleep: నిద్రపట్టడం లేదా? ఈ 3 యోగాసనాలు వేస్తే వేగంగా పడుకుంటారు!

Yoga poses for Sleep: నిద్రపట్టడం లేదా? ఈ 3 యోగాసనాలు వేస్తే వేగంగా పడుకుంటారు!

18 November 2024, 6:00 IST

google News
    • Yoga poses for Sleep: నిద్రలేమిని తగ్గించేందుకు కూడా యోగాలో కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయి. వీటిని సాధన చేస్తే నిద్ర త్వరగా పట్టేందుకు తోడ్పడతాయి. ఆ మూడు ఆసనాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Yoga poses for Sleep: నిద్రపట్టడం లేదా? ఈ 3 యోగాసనాలు వేస్తే వేగంగా పడుకుంటారు!
Yoga poses for Sleep: నిద్రపట్టడం లేదా? ఈ 3 యోగాసనాలు వేస్తే వేగంగా పడుకుంటారు!

Yoga poses for Sleep: నిద్రపట్టడం లేదా? ఈ 3 యోగాసనాలు వేస్తే వేగంగా పడుకుంటారు!

యోగాలో అధిక సంఖ్యలో ఆసనాలు ఉంటాయి. ఆసనాలను బట్టి వాటి వల్ల శారీరకంగా, మానసికంగా వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. కొందరికి రాత్రివేళ సరిగా నిద్రపట్టదు. నిద్రలోకి జారుకునేందుకు నానా తంటాలు పడుతూ బెడ్‍పై పొర్లుతూ ఉంటారు. నిద్రలేమితో బాధడుతుంటారు. అయితే, వేగంగా నిద్రపట్టేందుకు కూడా యోగాలో కొన్ని ఆసనాలు తోడ్పడతాయి. త్వరగా పడుకునేలా చేసి.. నిద్ర నాణ్యతను కూడా పెంచగలవు. అలా నిద్రను మెరుగు చేసే మూడు ఆసనాలు ఏవో ఇక్కడ చూడండి.

బాలాసనం

యోగాలో బాలాసనం చాలా సులువైనది. ఈ ఆసనం రోజులో ఎప్పుడైనా వేయవచ్చు. దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ ఆసనం చేయడం నిద్ర త్వరగా పట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ రాత్రివేళ నిద్ర రాకుంటే.. ఆ ఆసనం సాధన చేయవచ్చు. దీంతో ఒత్తిడి, టెన్షన్లు, నీరసం పోతాయి. త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఈ ఆసనం ఉంటుంది. అందుకే ఇంగ్లిష్‍లో చైల్డ్ పోజ్ అంటారు.

  • బాలాసనం ఇలా: ముందుగా కింద మోకాళ్లపై కూర్చోవాలి.
  • గాలి పీల్చుకుంటూ నడుమును ముందుకు వంచాలి.
  • ఆ తర్వాత చేతులను ముందుకు చాపాలి. ముంజేతులను చేతికి ఆనించాలి.
  • ముంజేతులను, తలను నేలకు ఆనించాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస పీల్చుస్తూ వదులుతూ ఉండాలి.

బద్ధకోణాసనం

బద్ధకోణాసనం వేయడం వల్ల శరీరం మొత్తం విశ్రాంతిగా ఫీల్ అవుతుంది. మెదడులో ప్రశాంతత ఏర్పడుతుంది. రాత్రివేళ నిద్ర బాగా పట్టేలా సహకరిస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాన్ని సీతాకోక చిలుక ఆసనం అని కూడా పిలుస్తారు.

  • బద్ధకోణాసనం ఇలా: ముందుగా కింద కూర్చోవాలి. ఆ తర్వాత రెండు కాళ్లను పక్కలకు దూరంగా జరపాలి.
  • ఆ తర్వాత మోకాళ్ల నుంచి కాళ్లను మడవాలి. రెండు పాదాలు తాకేలా ఉంచాలి.
  • అనంతరం రెండు అరచేతులను చేతివేళ్లతో గట్టిగా పట్టుకోవాలి. రెండు పాదాలు కలిసిన చోట చేతులతో పట్టుకోవాలి. పాదాలు శరీరానికి మరింత దగ్గరికి వచ్చేలా చేయాలి.
  • ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. కాసేపు అదే భంగిమలో ఉండాలి.

బద్ధకోణాసనం (Photo: Freepik)

సేతుబంధాసనం

నిద్రలేమి సమస్యను సేతుబంధాసనం తగ్గించగలదు. దీన్ని బ్రిడ్జ్ (వంతెన) పోజ్ అని అంటారు. ఈ ఆసనంలో శరీరం వంతెనలా ఉంటుంది. దీంతో ఆ పేరు వచ్చింది. ఈ ఆసనం వేయడం వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గిపోతాయి. వేగంగా నిద్రపట్టేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.

  • సేతుబంధాసనం ఇలా: ముందుగా కింద వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత మెల్లగా మోకాళ్లను వంచాలి.
  • మోకాళ్లను వంచి శ్వాస గట్టిగా తీసుకొని.. రెండు చేతులతో పాదాలను పట్టుకొని నడుమును పైకి ఎత్తాలి. మీకు వీలైనంత మేర నడుమును ఎత్తాలి.
  • గడ్డానికి ఛాతి తగిలేంతలా నడుమును ఎత్తాలి. నడుము పైకి ఎత్తి ఉండగా.. శరీర భారం పాదాలు, మెడ, తల, భుజాలపై ఉంటుంది. ఈ సేతుబంధాసనంలో వీలైనంత సమయం ఉండాలి. ఆ తర్వాత మళ్లీ సాధారణంగా వెల్లకిలా పడుకున్న పొజిషన్‍కు రావాలి.

సేతుబంధాసనం
తదుపరి వ్యాసం