తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Leaf Bathing Benefits : అరటి ఆకులో స్నానం చేస్తే 100 ఏళ్లు బతుకుతారు!

Banana Leaf Bathing Benefits : అరటి ఆకులో స్నానం చేస్తే 100 ఏళ్లు బతుకుతారు!

Anand Sai HT Telugu

16 February 2024, 18:30 IST

google News
    • Banana Leaf Bathing Benefits Telugu : అరటి ఆకులో స్నానం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలా స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అరటి ఆకుల్లో స్నానం
అరటి ఆకుల్లో స్నానం (twitter)

అరటి ఆకుల్లో స్నానం

అరటి చెట్టు అనేది మన జీవితంతో ముడిపడి ఉన్నది. మన పూర్వీకుల నుంచి ఇప్పటివరకూ అరటి చెట్టు ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాం. చాలా మంది అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ఉంటారు. అద్భుతమైన గుణాలు కలిగిన అరటి ఆకు మనం తినే ఆహారాన్ని విషపదార్థాల నుండి కాపాడుతుంది, శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. దీనివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అరటి ఆకుల్లో స్నానం చేస్తే కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి.

ప్రకృతితో మమేకమై జీవించడం, సంప్రదాయ ఆహారాలు తినడం, కృత్రిమ ఎరువులు లేకుండా బియ్యం, కూరగాయలు, పండ్లు పండించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సిద్ధ వనమూలికల ద్వారా పరిష్కారాలు కనుగొనడం వంటివి.. ఈరోజుల్లో చాలామంది పాటిస్తు్న్నారు. అలా కొంతమంది పాటించే పద్ధతి అరటి ఆకుల్లో స్నానం చేయడం.

నీరు అవసరం పెద్దగా లేదు

అరటి ఆకులో స్నానం చేయడం సన్ బాత్ లాంటిది. దీనికి నీరు అవసరం లేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం ఉండాలి. ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి ఇది మెుదలుపెట్టాలి. నడుము కింది భాగానికి ఓ చిన్న టవల్ కట్టుకోవాలి. తలపై తడి తువ్వాలు చుట్టుకోవాలి. అరటి ఆకులతో శరీరానికి బాగా చుట్టి, ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే అంటే ముక్కుకు మాత్రం గ్యాప్ ఉండాలి. ఓ చాప మీద పడుకోవాలి. అలా సూర్యుడి వేడికి అరటి ఆకులు కట్టుకుని కనీసం అరగంట సేపు ఉండాలి.

ఆకులపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. చెమట గట్టిగా వచ్చేలా చేయాలి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే, మధ్యలో బయటకు రావచ్చు. ఇంతే ఇదే అరటి ఆకుల్లో స్నానం. ఇలా చేస్తే చెమట విపరీతంగా బయటకు వస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.

అనేక సమస్యలకు చెక్

ఇది శ్వాసకోశ రుగ్మతలు, అలెర్జీ చర్మ రుగ్మతలు, చేతులు, కాళ్ళు వాపు, శరీరంలో చెడు నీటి వల్ల వచ్చే వ్యాధులు, మూత్రపిండాల లోపాలు, శరీర గ్రంధి లోపాలు, కండరాల, నరాల రుగ్మతలను సరిచేస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. శరీరం నిగనిగలాడుతుంది, దృఢంగా చేస్తుంది.

అరటి ఆకులతో చికిత్స

మనం ఇంట్లో ఎక్కువగా పెంచుకునే అరటి చెట్లు, గాలి నుండి కార్బన్‌ను పీల్చుకుంటాయి. మానవులు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. గ్రామాల్లో కాలిన గాయాలకు గురైన వారికి ముందుగా అరటి బెరడు, అరటి ఆకులతోనే చికిత్స చేస్తారు. అరటి తొక్కలు, ఆకులు కాలిన గాయాలను నిరోధించడంలో, సెప్టిక్‌గా మారకుండా చూస్తాయి.

విషపదార్థాలు ఔట్

అదేవిధంగా అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే శరీరంలోని విషపదార్థాలను బయటకు వెళ్లి.. అరటి ఆకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి పునరుత్తేజం కలుగుతుంది. అరటి ఆకులు శరీరంలోని విషపూరితమైన గాలిని పీల్చుకుని మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అరటి ఆకులో స్నానం చేయడం వల్ల శరీరంలోని అపరిశుభ్రమైన నీటిని చెమట గ్రంధుల ద్వారా వదిలించుకోవచ్చు. ఈ అరటి ఆకు స్నానానికి శరీర నాళాల్లోని రుగ్మతలను, కిడ్నీ డ్యామేజ్‌ని సరిచేసే శక్తి ఉంది.

ఫుడ్ కంట్రోల్ ఉండాలి

అరటి ఆకుల్లో స్నానం కోసం.. మొదటి రోజు ఎక్కువగా పచ్చి కూరగాయలు, పండ్లు, దోసకాయ రసం లేదా నారింజ రసంతో ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజ్, టీ, కాఫీ, శీతల పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సాధారణ ఉష్ణోగ్రతలో నిద్రపోవాలి. అరటి ఆకుల్లో స్నానం కోసం నీళ్లు ఎక్కువగా తాగి, తలస్నానం చేసిన తర్వాత మెుదలుపెట్టాలి.

స్త్రీలు కూడా చేయెుచ్చు

స్నానం చేసిన తర్వాత రోజంతా పండ్లు, కూరగాయల ఆహారాన్ని తినడం మంచిది. లేకుంటే మీరు కొంచెం రైస్ కూడా తినొచ్చు. స్త్రీలు కూడా ఈ స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఉల్లాసాన్ని పొందవచ్చు. అరటి ఆకుల్లో స్నానం చేయడం మెుదట కష్టమే అయినా తర్వాత బాగుంటుంది. మీరు ఫ్రీగా ఉండొచ్చు. మీ శరీరంలోని మార్పులు మీకు అర్థమవుతాయి. ఆయుర్వేదం ఎక్కువగా ఉపయోగించే సమయంలో ఈ అరటి ఆకుల్లో స్నానం ఎక్కువగా చేసేవారు. శరీరంలోని టాక్సిన్స్ పోయి ఎక్కువ కాలం బతికేవారు.

తదుపరి వ్యాసం