Amardeep Chowdary: బిగ్ బాస్ హౌజ్‍లో అమర్ దీప్‍కు నరాల సమస్య.. కేసులు పెడతారన్న భయంతో ఆ పని!
Bigg Boss 7 Telugu Crying Task: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‍లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా హౌజ్‍లో కంటెస్టెంట్లకు ఇచ్చిన కన్నీళ్ల టాస్కును ఎపిసోడ్ నుంచి తీసిపడేశారు బిగ్ బాస్ మేకర్స్. అందుకు గల కారణాల్లోకి వెళితే..
Bigg Boss 7 Telugu September 28th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో ఆట సందీప్, హీరో శివాజీ, శోభా శెట్టి పర్మనెంట్ హౌజ్ మేట్స్ అయిన విషయం తెలిసిందే. నాలుగో పవరాస్త్ర కోసం కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో శివాజీ, సందీప్, శోభా ముగ్గురు బ్యాంకర్స్ గా ఉన్నారు. వారికి చెరో 100 కాయిన్స్ ఇవ్వగా.. అందులో నుంచి కంటెస్టెంట్స్ అందరికీ నచ్చినంతగా పంచారు. ఇక వాటి నుంచి ఒకరి దగ్గర నుంచి కాయిన్స్ మరొకరు గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఏటీఎమ్ బజర్ టాస్క్ నిర్వహించాడు.
కన్నీళ్లు నింపే టాస్క్
బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 28వ తేది ఎపిసోడ్‍లో ఏటీఎమ్ బజర్ టాస్కులో కాయిన్స్ సౌండ్ వచ్చినప్పుడు ప్రిన్స్ యావర్ బజర్ మోగించాడు. దీంతో అతని పార్టనర్, ప్రత్యర్థులను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రశాంత్‍ను తన పార్టనర్‌గా, ప్రత్యర్థులుగా గౌతమ్, అమర్‍లను అనుకున్నాడు ప్రిన్స్. వీరికి ఒక చిన్న గ్లాస్ నిండా కన్నీళ్లు నింపే టాస్క్ (Bigg Boss 7 Telugu Tears Task) ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అమర్, గౌతమ్ ఉల్లిపాయలు, నిమ్మకాయలు కంట్లో పిండుకుని నీళ్లు తెప్పించుకునేందుకు ప్రయత్నించారు.
సహజంగానే కన్నీళ్లు
అనంతరం సహజంగానే కన్నీళ్లు రావాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక తప్పక లోపలి నుంచి బాధను తెప్పంచుకుని కన్నీళ్లు రావడానికి అమర్, గౌతమ్ తెగ ట్రై చేశారు. ప్రశాంత్ నేలమీద దొర్లుతూ మరి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. ప్రశాంత్‍ను చూసి శోభా తెగ ఏడ్చేసింది. వామ్మో వీడేంటి ఇలా చేస్తుండు అని రతిక లుక్ ఇచ్చింది. అయితే ఇదంతా లైవ్‍లో వచ్చింది. కానీ, ఎపిసోడ్‍లో మాత్రం మొత్తం ఎత్తేశారు. కేవలం కన్నీళ్ల టాస్కులో ప్రశాంత్, యావర్ ఇద్దరూ గెలిచారు అని ప్రకటించారు.
చరిత్రలో తొలిసారి
బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా ఒక టాస్కును ఎపిసోడ్ నుంచి ఎత్తేశారు. అయితే అందుకు కారణం ఈ టాస్కులో సీరియల్ హీరో అమర్ దీప్‍కు నరాలు స్టక్ అయిపోయి కింద పడిపోయాడట. అంతేకాకుండా ఏడుపు టాస్కులో వాళ్లు కన్నీళ్ల కోసం చేసే ప్రయత్నాలు జనాలు చూస్తే భరించలేరని, ఎపిసోడ్ తర్వాత షోపై కేసులు కూడా పెట్టే అవకాశం ఉందని ముందుగానే పలువురు రివ్యూవర్లు రివ్యూ ఇచ్చారు. ఈ భయంతోనే కన్నీళ్ల టాస్కులు బిగ్ బాస్ మేకర్స్ ఎత్తేశారని రివ్యూవర్స్ చెబుతున్నారు.