Wake Up Early : ముసలివాళ్లు త్వరగానే ఎందుకు నిద్ర లేస్తారు?
13 June 2023, 20:00 IST
- Wake Up Early : మీ కుటుంబంలో లేదా మీ పక్క ఇంట్లో వృద్ధులు ఉన్నట్లయితే, ప్రతిరోజూ ఉదయాన్నే వారి చూడవచ్చు. మార్నింగ్ వాక్ చేసేవారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడం మీరు గమనించవచ్చు. వారు ఉదయాన్నే లేస్తారు. వారికి మెలకువ వచ్చేస్తుంది. ఎందుకు అలా?
ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా చాలా మంది వృద్ధులు అర్ధరాత్రి(Midnight) నిద్ర లేవడం, తర్వాత నిద్రపోలేకపోవడం, మూత్ర విసర్జన ఎక్కువగా రావడం, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. సహజ వృద్ధాప్య ప్రక్రియ మన శరీర సహజ నిద్ర(Natural Sleep), మేల్కొనే సమయాలను ప్రభావితం చేస్తుంది. నిద్ర విధానాలలో మార్పు వెనుక ఒక కారణం ఏమిటంటే, మన మెదడు వయస్సు పెరిగే కొద్దీ స్పందించడం తగ్గుతుంది.
మన వయస్సు పెరిగే కొద్దీ, సూర్యాస్తమయాలు, సూర్యకాంతి వంటి వాటికి మన మెదడు(Mind) ప్రతిస్పందనలు మునుపటిలా ఉండవు. ఇది మన సమయ స్పృహను, ఒక నిర్దిష్ట రోజులో మనం ఎక్కడ ఉన్నామో గుర్తించే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇంద్రియాలు క్షీణించడం ప్రారంభిస్తాయి. ఇతరుల కంటే ముందుగానే మేల్కొంటారు.
వయస్సు-సంబంధిత మార్పులు మన మెదడు పొందే కాంతి ప్రేరణ తీవ్రతను తగ్గిస్తాయి. ఈ కాంతి ఉద్దీపన మన సర్కాడియన్ గడియారాన్ని అమర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంటిశుక్లం ఉన్న పెద్దలు సాధారణంగా అస్పష్టమైన దృష్టి, డబుల్ దృష్టి, సాధారణ దృష్టి లోపం వంటి సమస్యల కారణంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు.
బాగా నిద్రపోవాలంటే ముందుగా చేయాల్సిన పని రాత్రి త్వరగా పడుకోకుండా ఉండాలి. మరి లేట్ నైట్ వరకూ ఉండొద్దు. సూర్యాస్తమయానికి 30 నుండి 60 నిమిషాల ముందు సాయంత్రం వెలుతురులో ఉండటం అలవాటు చేసుకోండి. సూర్యాస్తమయానికి ముందు బయట నడవడం లేదా ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూర్చొని పుస్తకం చదవడం ద్వారా మార్పు రావొచ్చు. సూర్యుడు ఇంకా అస్తమించలేదని మీ మెదడుకు తెలియజేస్తాయి. ఇది ప్రారంభ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. మీ నిద్ర చక్రాన్ని(Sleep Cycle) నియంత్రించడంలో సహాయపడుతుంది.
మెలటోనిన్(melatonin) అనేది చీకటికి ప్రతిస్పందనగా మెదడు ఉత్పత్తి చేసే హార్మోన్. కళ్లలో కాంతి తక్కువగా ఉన్నప్పుడు, నిద్రపోయే సమయం ఆసన్నమైందని మెదడుకు సిగ్నల్ పంపబడుతుంది. ఇది మీ శరీరం మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది, దీనిని స్లీప్ హార్మోన్ అని కూడా పిలుస్తారు.