Weight Loss Tips : పన్నీర్ తింటే బరువు తగ్గుతారా?
12 June 2023, 12:42 IST
- Paneer For Weight Loss : చాలా మంది లావుగా ఉండటం గురించి బాధపడుతుంటారు. లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్ సైజ్ కి సమయం లేకపోవడం ఈ కారణాలన్నీ అధిక బరువు పెరగడానికి కారణమవుతాయి. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
బరువు తగ్గే చిట్కాలు
బరువు తగ్గాలంటే డైట్ కి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. డైట్ ఫుడ్(Diet Food) అంటే ఆ డైట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే. నోటికి రుచిగా ఉండే ఫుడ్ తినడం కుదరదు. ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది.. దీని వల్ల చాలా మందికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం కష్టం. మీరు పన్నీర్‌ను ఇష్టపడితే, పన్నీర్ డైట్(Paneer Diet) పాలసీ ద్వారా బరువు తగ్గడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం..
పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. పన్నీర్‌లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, సెలీనియం, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. పనీర్‌లోని ఈ పోషకాలన్నీ బరువును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
మనం బరువు తగ్గాలని(Weight Loss) ప్రయత్నించినప్పుడు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి. కొంతమంది భోజనం మానేసి, పౌష్టికాహారం తీసుకోకుండా బరువు తగ్గుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గితే అది శాశ్వతం కాదు. ఇలా చేయడం వల్ల మన శరీరంలో పోషకాలు లోపించి అనారోగ్యానికి గురవుతారు. బరువు తగ్గడానికి మనం డైట్‌లో ఉన్నప్పుడల్లా ఆహారం(Food)లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గడానికి పనీర్ ఒక అద్భుతమైన ఎంపిక.
మిగతా పాల ఉత్పత్తుల కంటే పన్నీర్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే పనీర్ తింటే త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడాన్ని అరికట్టవచ్చు.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. పన్నీర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది శరీరం(Body)లో చక్కెర పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి కూడా అవసరం. పన్నీర్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
పనీర్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. మీరు పనీర్‌ను గ్రిల్ చేసి తినండి. దీన్ని వేయించవద్దు. నూనెలో వేయించకుండా తీసుకుంటే మంచిది. చపాతీకి పన్నీర్ సూపర్ కాంబినేషన్. నోటికి రుచి కూడా ఉంటుంది. డైట్ పాటించడం కష్టం అనిపించదు.