తెలుగు న్యూస్ / ఫోటో /
Weight Loss Tips: బరువు తగ్గే ప్రయత్నంలో తప్పులు చేయకండి, ఈ చిట్కాలను పాటించండి!
- Weight Loss Tips: బరువు తగ్గేందుకు చాలా మంది చాలా కష్టపడతారు. అనేక వ్యాయామాలు చేస్తారు, అయినప్పటికీ కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో చూడండి..
- Weight Loss Tips: బరువు తగ్గేందుకు చాలా మంది చాలా కష్టపడతారు. అనేక వ్యాయామాలు చేస్తారు, అయినప్పటికీ కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో చూడండి..
(1 / 7)
మీరు బరువు తగ్గాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, శ్రమకోర్చి.. చెమటోడ్చిన తర్వాత కూడా ఎలాంటి తేడా కనిపించకపోతే నిరాశ చెందకండి. చిన్నచిన్న లోపాలు కారణం కావచ్చు. బరువు తగ్గడంలో మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ చూడండి.
(2 / 7)
మీరు బరువు తగ్గాలంటే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే క్రమశిక్షణ అలాగే క్రమబద్ధత అనే రెండు ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
(3 / 7)
బరువు తగ్గడానికి మొదటి నియమం బయట చేసిన ఆహారానికి దూరంగా ఉండటం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు నిండుగా ఉండగలుగుతారు. మీ ఆహారంలో చిక్కుళ్ళు, పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
(4 / 7)
ప్రొటీన్లు అధికంగా ఉన్న అల్పాహారం తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి అదనపు ఆకలి కోరికలను నివారించవచ్చు.
(5 / 7)
బరువు తగ్గడానికి 80:20 నియమాన్ని అనుసరించండి. అంటే మీరు మీ కడుపు 80 శాతం నిండే వరకు తిండి, ఆపై కొంచెం నీరు త్రాగండి. తిన్న తర్వాత కూడా మీ కడుపు 20 శాతం ఖాళీగా ఉంచండి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదనపు కేలరీలు పేరుకుపోవు.
(6 / 7)
మీ ఆహారాన్ని నెమ్మదిగా తినడం, నమలడం మంచిది. ఆ విధంగా, మీరు తక్కువ తింటారు. నిదానంగా తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
ఇతర గ్యాలరీలు