తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices For Digestion । ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే.. ఈ 5 మసాలాలు వేయండి!

Spices For Digestion । ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే.. ఈ 5 మసాలాలు వేయండి!

HT Telugu Desk HT Telugu

09 February 2023, 11:30 IST

    • Spices For Digestion: ఆహారం సులభంగా జీర్ణం కావాలి, జీర్ణక్రియ మెరుగుపడాలి అనుకుంటే మీ వంటల్లో ఇక్కడ పేర్కొన్న మసాలా దినుసుల వినియోగం పెంచండి.
Spices For Digestion
Spices For Digestion (Unsplash)

Spices For Digestion

మనం తినే ఆహారం జీర్ణం అయినపుడే శక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మన ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ అనేది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం మాత్రమే కాదు. ఇది కణాల పెరుగుదల, మరమత్తు కోసం కూడా అవసరం. జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అయితే జీర్ణక్రియ మెరుగుపడేందుకు వంటకాల్లో ఉపయోగించే కొన్ని మసాలా దినుసులు చాలా సహాయం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మసాలా దినుసులను ఆహారంలో కలపడం ద్వారా పైత్య రసాలను స్రవించేలా కాలేయాన్ని ప్రేరేపిస్తాయి. కొవ్వు లాంటి కఠినమైన పదార్థాలు జీర్ణం కావాలన్నా ఈ పైత్య రసం అవసరం. అలాగే మన శరీరంలోని ఆహారాన్ని శోషించడానికి కూడా పైత్య రసాలు చాలా ముఖ్యమైనవి.

Spices For Digestion- జీర్ణక్రియకు తోడ్పడే మసాలా సామాగ్రి

మీ జీర్ణక్రియ సామర్థ్యం మెరుగుపడాలంటే మీరు చేసే ప్రతీ వంటకంలో ఈ మసాలా దినుసులను తప్పకుండా చేర్చుకోండి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

జీలకర్ర

జీర్ణక్రియకు సంబంధించి జీలకర్ర అత్యంత శక్తివంతమైన జీర్ణ ఔషధం. ఇది ఆహారానికి బలమైన ఫ్లేవర్ అందిస్తుంది, జీర్ణ శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతుంది. పేగుల నిర్విషీకరణతో పాటు, పేగులలో మంచి సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడుతుంది.

ఫెన్నెల్

ఫెన్నెల్ లేదా సోంపులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. జీవక్రియ ప్రక్రియలో కూడా కరగని జడమైన ఫైబర్‌ను సోంపు కలిగి ఉంటుంది. ఫెన్నెల్ జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా, దీనిలోని జడఫైబర్ జీర్ణమైన ఆహారానికి అతుక్కొని పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇది పెద్దప్రేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

మెంతులు

మెంతులు కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఆహారంలో మెంతుల వినియోగం వలన మీ బ్లడ్ షుగర్ నియంత్రణతో పాటు, కడుపు శుభ్రతకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతులు సహజమైన జీర్ణక్రియలా పనిచేస్తాయి. ఇది కాకుండా, మెంతులు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడతాయి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ మసాలాను చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. ఇది వివిధ వంటకాలకు సహజంగా తీపి రుచిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారు తియ్యదనం కోసం, మెరుగైన జీర్ణక్రియ కోసం దాల్చనచెక్క ఉపయోగించవచ్చు.

అల్లం

అల్లం జీర్ణశయ సమస్యలను తగ్గించ్చే ఫినోలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. లాలాజలం, పైత్యరస ఉత్పత్తిలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అల్లం జీర్ణక్రియను లైపేస్ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇంకా పేగు కండరాలను సడలించడం ద్వారా పేగు సంకోచాలను తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణమైన ఆహారాన్ని సులభంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది.

పసుపు

దాదాపు ప్రతి భారతీయ వంటకంలో పసుపును ఉపయోగిస్తారు. ఇది వంటకానికి రంగును ఇవ్వడమే కాకుండా, ఔషధ గుణాలను పెంచుతుంది. పసుపు ఒక యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ మసాలా.

టాపిక్