NNS 20th September Episode: మనోహరిలోకి అరుంధతి ఆత్మ.. తెగ సంబరపడిపోతున్న మిస్సమ్మ.. క్షమాపణ చెప్పిన గుప్త
20 September 2024, 6:00 IST
- NNS 20th September Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (సెప్టెంబర్ 20) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మను మనోహరి తనలోకి తీసుకురావాలని ఘోరా చెబుతాడు. అటు మిస్సమ్మ ఎంతో సంబరపడిపోతూ కనిపించగా.. ఆరుకు గుప్త క్షమాపణ చెబుతాడు.
మనోహరిలోకి అరుంధతి ఆత్మ.. తెగ సంబరపడిపోతున్న మిస్సమ్మ.. క్షమాపణ చెప్పిన గుప్త
NNS 20th September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 20) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చిత్రగుప్తుడి ఉంగరం ఇచ్చి రాథోడ్ బారి నుంచి కాపాడుతుంది అరుంధతి. ఉంగరం ఇవ్వకుండా ఎప్పటికీ భూలోకంలోనే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు తనకు సాయం చేసినట్లు అని ఆరుని అడుగుతాడు గుప్త.
అరుంధతిని క్షమించమని అడిగిన గుప్త
మిమ్మల్ని భయపెట్టో, మోసం చేసో ఇక్కడే ఉండాలని నేను అనుకోవడం లేదు గుప్తగారు, ఇప్పటికే మీరు నాకోసం చాలా చేశారు. నాకు ఇష్టమైనన్ని రోజులు భూమిపై ఉండే అవకాశం కల్పించారు. ఒకవేళ మీరే ఏదైనా మాట మారిస్తే పైన మా రాజుగారు ఉన్నారు కదా.. అంటుంది ఆరు.
అంత నమ్మకం ఏంటి నా మీద అంటాడు గుప్త. మీరు నా అన్న.. మిమ్మల్ని కాకపోతే ఎవర్ని నమ్ముతాను అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది అరుంధతి. నన్ను క్షమించు బాలిక.. ఆ ఘోరా బారి నుంచి నిన్ను కాపాలంటే ఈ పౌర్ణమి ఘడియలు మొదలు కాకముందే నిన్ను మా లోకానికి తీసుకుని వెళ్లాలి. నా విధిని నిర్వహించడం కోసం నీకిచ్చిన మాట తప్పుతున్నాను అంటాడు గుప్త.
అమర్ షర్ట్ బటన్ కుట్టిన మిస్సమ్మ
అమర్ ఆఫీస్‌కి వెళ్లడానికి రెడీ అవుతూ తన షర్ట్ బటన్ ఊడిపోయిందని చూసి వేరే షర్ట్ కోసం వెతుకుతాడు. కానీ వేరే షర్ట్ కనపడకపోవడంతో మిస్సమ్మను పిలిచి బటన్ ఊడిపోయిందని వేరే షర్ట్ లేదని అంటాడు. ఆ షర్ట్ తనే వాషింగ్‌కి వేశానని చిటికెలో బటన్ కుట్టేస్తానంటుంది మిస్సమ్మ. సరే కానియ్యమంటాడు అమర్.
వినాయకుడికి తను చేసిన పూజ ఫలించిందని, మమ్మల్ని దగ్గర చేయడానికే ఈ ప్లాన్ వేశావు కదా.. అంటూ దేవుడికి థాంక్స్ చెప్పి తనలో తనే మురిసిపోతుంది మిస్సమ్మ. ఏయ్.. లూజ్.. బటన్ కుడతావా వేరే షర్ట్ వేసుకోనా అంటాడు అమర్. చిటికెలో కుట్టేస్తా అంటూ పరుగున వెళ్లి సూదీ, దారం తెచ్చి బటన్ కుడుతుంది మిస్సమ్మ. అమర్ మిస్సమ్మనే చూస్తూ ఉంటాడు. సూది గుచ్చుకున్న మిస్సమ్మను కోప్పడతాడు.. అదే కత్తి కాదని, అంత ఫీలవక్కర్లేంటుంది మిస్సమ్మ.
బటన్ కుట్టి దారం కొరుకుతున్న మిస్సమ్మను చూసి అమర్ ఫీలవుతాడు. అప్పుడే అటుగా వచ్చిన రాథోడ్ వాళ్లిద్దరినీ చూసి సంబరపడిపోతాడు. సర్.. జీప్ రెడీ.. ఏం పర్లేదు.. మీ పనయ్యాకే రండి అంటూ వెళ్లిపోతాడు. రాథోడ్.. అంటూ ఏమైంది.. ఇంకెంతసేపు అంటాడు అమర్. అయిపోయిందని దారం కొరికేస్తుంది మిస్సమ్మ. అమర్ వెంటనే బయటకు వెళ్తాడు.
మనోహరిలోకి అరుంధతి ఆత్మ
ఘోరా అరుంధతి ఆత్మను బంధించేందుకు పూజ చేస్తుంటాడు. ఈ పౌర్ణమికి ఆ ఆత్మకు శక్తులు రాకముందే బంధించాలంటుంది మనోహరి. ఈ పౌర్ణమికి ఆ ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశిస్తుందోనని భయంగా ఉందంటుంది. ఎవరో శరీరంలోకి కాదు నీ శరీరంలోకే ప్రవేశిస్తుంది అంటాడు ఘోరా. ప్రవేశించేలా నువ్వే చెయ్యాలి.. అప్పుడే నేను ఆ ఆత్మని బంధించగలను అంటాడు.
అర్థమయ్యేలా చెప్పమంటుంది మనోహరి. పౌర్ణమిరోజు ఆ ఆత్మ నీ శరీరంలోకి ప్రవేశించేలా నువ్వే ప్రేరేపించాలి. మళ్లీ బయటకు వెళ్లకుండా నేను చేస్తాను. నీ శరీరంలో ఉండగానే ఆత్మను బంధిస్తాను అంటాడు ఘోరా. అసలు ఆరు ఆత్మ తన శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది అంటుంది మనోహరి. తను చెప్పినట్లు చేయమని ఓ ప్లాన్ చెబుతాడు ఘోరా.
ప్లాన్ బానే ఉంది కానీ ఆ అరుంధతి నమ్ముతుందా అని అడుగుతుంది మనోహరి. నువ్వు ఆ ఆత్మను నమ్మేలా చేయాలి .. అప్పుడే ఆ అమరేంద్ర నీవాడవుతాడు.. నీ భర్త ఈ లోకంలోనే ఉండడు అని హామీ ఇస్తాడు. సరే అలాగే చేస్తాను అంటుంది మనోహరి.
సంబరపడిపోతున్న మిస్సమ్మ
భాగీ సంతోషంగా మెట్లు దిగుతూ ఉంటుంది. అది చూసిన అరుంధతి ఏంటి.. మిస్సమ్మ ఇంతగా సంబరపడిపోతుంది అనుకుంటుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన నిర్మల కూడా మిస్సమ్మను చూసి ఏంటి ఇంతలా సిగ్గుపడుతోంది అనుకుంటుంది. ఇంతలా మెలికలు తిరుగుతుందంటే ఇద్దరి మధ్యలో ఏదో జరిగే ఉంటుంది అనుకుంటుంది అరుంధతి.
ఘోరా ప్లాన్ ప్రకారం అరుంధతి ఆత్మ మనోహరిలో ప్రవేశిస్తుందా? చిత్రగుప్తుడు అరుంధతి ఆత్మను పౌర్ణమి ముందే యమలోకానికి తీసుకెళ్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్