తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

Vishwak Sen Devara Trailer: నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

12 September 2024, 15:20 IST

google News
    • Vishwak Sen Devara Trailer: దేవర ట్రైలర్ ను విమర్శించిన ఓ యూట్యూబర్ పై నటుడు విశ్వక్ సేన్ మండిపడ్డాడు. తన పేరు ఖరాబ్ చేయడానికే వీడు పుట్టాడంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్
నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు.. దేవర ట్రైలర్‌ను విమర్శించిన యూట్యూబర్‌పై విశ్వక్ కామెంట్స్

Vishwak Sen Devara Trailer: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజైన విషయం తెలుసు కదా. ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే తారక్ కు వీరాభిమాని అయిన విశ్వక్ సేన్ తాజాగా ఈ దేవర ట్రైలర్ ను విమర్శించిన ఓ యూట్యూబర్ పై మండిపడ్డాడు. తన ఇన్‌స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

నా పేరు ఖరాబ్ చేస్తున్నాడు

నిజానికి విశ్వక్ సేన్ ఎవరినైతే విమర్శించాడో అతని పేరు కూడా విశ్వకే. దీంతో తన పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడంటూ అతడు అసహనం వ్యక్తం చేశాడు. దేవర ట్రైలర్ తనకు నచ్చలేదంటూ ఆ యూట్యూబర్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. విశ్వక్ ఈ కామెంట్స్ చేశాడు. దేవర ట్రైలర్ గురించి ఓ ఇద్దరు యూట్యూబర్లు చర్చించుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.

"నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు వీడు. ఫస్ట్ గోడకి సపోర్ట్ లేకుండా రెండు నిమిషాలు కూర్చో నువ్వు. తర్వాత సినిమాని, ఆడియెన్స్ ని ఉద్ధరిద్దువుగానీ. కాల్తుంది నాకు కానీ, ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది. ఏం చేద్దాం. నువ్వే మాట్లాడాలి అందం గురించి" అని విశ్వక్ కామెంట్ చేశాడు. అదే సమయంలో అవతలి వ్యక్తి పేరు కూడా విశ్వకే అని క్లారిటీ ఇచ్చాడు. "ఆ కుడివైపు ఉన్న వ్యక్తి పేరు కూడా విశ్వక్ అని అనుకుంటున్నాను" అని విశ్వక్ సేన్ కామెంట్ చేయడం విశేషం. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని

తాను జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని అని గతంలోనే విశ్వక్ సేన్ చెప్పిన విషయం తెలిసిందే. అతనితో విశ్వక్ కు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యే సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తారక్ ను అతడు కలిశాడు. ఈ ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని ఎన్టీఆర్ అన్నాడు.

"ఫ్రెష్ ఐడియాలు, కంటెంట్ తో విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఇప్పుడు వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకెళ్లాలంటే ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి" అని ఎన్టీఆర్ గతంలో అన్నాడు.

దేవర మూవీ గురించి..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ఈ సినిమాలో వరద అనే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్, తంగం పాత్రలో జాన్వీ నటించారు.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటి వరకూ వచ్చిన మూడు పాటలూ అభిమానులను అలరించాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

విశ్వక్ సేన్ కామెంట్ స్క్రీన్ షాట్ ఇది
తదుపరి వ్యాసం