Vishwak Sen: నా సినిమా నచ్చకపోతే థియేటర్‌కు రాకండి.. ట్రైలర్‌కే ట్రైలర్.. హీరో విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్
22 October 2024, 10:49 IST
Vishwak Sen About Mechanic Rocky Movie: హీరో విశ్వక్ సేన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమా నచ్చకపోతే థియేటర్‌కు రాకండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ వదిలాడు. అతను నటించిన మెకానిన్ రాకీ ట్రైలర్ 1.0 లాంచ్ కార్యక్రమంలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
నా సినిమా నచ్చకపోతే థియేటర్‌కు రాకండి.. ట్రైలర్‌కే ట్రైలర్.. హీరో విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్
Vishwak Sen About Mechanic Rocky Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన న్యూ మూవీ 'మెకానిక్ రాకీ'. ఈ సినిమా ఫస్ట్ గేర్, సాంగ్స్‌తో మంచి క్రియేట్ చేసుకుంది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న మెకానిక్ రాకీ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
ఘనంగా ట్రైలర్ లాంచ్
ఇటీవల మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు మేకర్స్. శ్రీరాములు థియేటర్‌లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో మెకానిక్ రాకీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మెకానిక్ రాకీ ట్రైలర్‌కు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే, మెకానిక్ రాకీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇద్దరే ఉన్నారు
"ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే ఉన్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే" అని విశ్వక్ సేన్ అన్నాడు.
నేనే బజ్ ఇవ్వలేదు
"ఈ సినిమాకు బజ్ లేదు అంటున్నారు. నిజం చెప్పాలంటే నేనే ఇప్పటివరకు బజ్ ఇవ్వలేదు. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్నా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నవంబర్ 21, 7.30కి పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాం. యూఎస్ షో కంటే ముందే చూసుకోండి. చూసినోడు బాలేదంటే 22న థియేటర్‌కు రాకండి. అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా" అని విశ్వక్ సేన్ తెలిపాడు.
ట్రైలర్‌కు ట్రైలర్
"సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్‌లో ఉంది. సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్‌లా మారిపోతాయి. ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్‌కి ట్రైలర్ అనుకోండి. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమాతో ఆయనకి చాలా డబ్బులు రావాలి" అని విశ్వక్ సేన్ అన్నాడు.
మా కెమిస్ట్రీ ఎంజాయ్ చేస్తారు
"శ్రద్ధ వండర్‌ఫుల్ కో స్టార్. మీనాక్షికి థాంక్ యూ సో మచ్. మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దాం" అని హీరో విశ్వక్ సేన్ తన స్పీచ్ ముగించాడు.
చాలా కంటెంట్ ఉంది
కాగా, డైరెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. "విశ్వక్ గారి అభిమానులకి, మీడియా వారికి అందరికీ థాంక్ యూ. ట్రైలర్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఒకొక్కటి అనౌన్స్ చేస్తూ ఉంటాం. అవన్నీ మీకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను. నవంబర్ 22న సినిమా విడుదల అవుతోంది. అందరూ చూసి పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను" అని కోరారు.
ఇద్దరు హీరోయిన్స్
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ మెకానికి రాకీ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వీరితోపాటు నరేష్, సునీల్, వైవ హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.