తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Ott: నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Action Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

04 December 2024, 10:57 IST

google News
  • Action Thriller OTT: విశ్వ‌క్‌సేన్ మెకానిక్ రాకీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మాస్ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించారు.

యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ
యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ

యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ

Action Thriller OTT: విశ్వ‌క్‌సేన్ మెకానిక్ రాకీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతో ర‌వితేజ ముళ్ల‌పూడి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించారు.

మెకానిక్ రాకీ...

థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న మెకానిక్ రాకీ డిసెంబ‌ర్ మూడో వారంలో ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మెకానిక్ రాకీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

యావ‌రేజ్ రిజ‌ల్ట్‌...

ఇన్సూరెన్స్ మోసాల అనే పాయింట్‌కు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్ట‌ర్ ర‌వితేజ ముళ్ల‌పూడి మెకానిక్ రాకీ మూవీని తెర‌కెక్కించాడు. ప్ర‌మోష‌న్స్‌లో విశ్వ‌క్‌సేన్ చేసిన కామెంట్స్ కార‌ణంగా ఈ మూవీపై తెలుగు ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

రొటీన్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ మాస్ యాక్ష‌న్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. దాదాపు తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన మెకానిక్ రాకీ 12 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. విశ్వ‌క్‌సేన్ ఎన‌ర్జీ, మాస్ మ్యాన‌రిజ‌మ్స్‌తో పాటు శ్ర‌ద్ధా శ్రీనాథ్ క్యారెక్ట‌ర్ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి.

మెకానిక్ రాకీ కథ…

రాకేష్ అలియాస్ రాకీ (విశ్వ‌క్‌సేన్‌) మెకానిక్‌గా ప‌నిచేస్తూనే డ్రైవింగ్ పాఠాలు నేర్పుతుంటాడు. రాకీ గ్యారేజీ స్థ‌లాన్ని దొంగ ప‌త్రాలు సృష్టించి రంకిరెడ్డి (సునీల్‌) అనే రౌడీ ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తాడు.

రంకిరెడ్డి నుంచి త‌న గ్యారేజీ స్థ‌లాన్ని కాపాడుకోవ‌డానికి రాకీకి యాభై ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. డ‌బ్బు కోసం అన్వేషిస్తోన్న స‌మ‌యంలో రాకీ జీవితంలోకి మాయ వ‌స్తుంది. మాయ (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) సాయంతో రంకిరెడ్డి స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కాల‌ని రాకీ అనుకుంటాడు. కాలేజీ రోజుల్లోనే రాకీ ప్రేమించిన ప్రియ (మీనాక్షి చౌద‌రి) మ‌ళ్లీ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవ‌డానికి రాకీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది.

ప్రియ‌ను ప్రాణంగా ప్రేమించిన‌ రాకీ ఆమెకు దూర‌మ‌వ్వ‌డానికి కార‌ణం ఏమిటి? రాకీకి ద‌క్కాల్సిన ఓ ఇన్సూరెన్స్ సొమ్ములో నామినీగా మ‌రొక‌రు పేరు ఎందుకు ఉంది? ఆ పాల‌సీ ఎవ‌రిది? రాకీ జీవితంలోకి మాయ ఎందుకొచ్చింది? రాకీ త‌న బీటెక్ చ‌దువును మ‌ధ్య‌లోనే ఆప‌డానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

లైలాలో లేడీ గెట‌ప్‌...

మెకానిక్ రాకీ త‌ర్వాత లైలా అనే మూవీ చేస్తోన్నాడు విశ్వ‌క్‌సేన్ . రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ ఫాంట‌సీ ల‌వ్ స్టోరీ మూవీలో విశ్వ‌క్‌సేన్ లేడీ గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ మూవీతో పాటు జాతిర‌త్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయ‌బోతున్నాడు విశ్వ‌క్‌సేన్‌.

తదుపరి వ్యాసం