తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Imdb Rating: ఐఎండీబీ రేటింగ్‌లో లైగర్ రికార్డు..లాల్ సింగ్ చడ్ఢాను బ్రేక్ చేసిన చిత్రం

Liger IMDb Rating: ఐఎండీబీ రేటింగ్‌లో లైగర్ రికార్డు..లాల్ సింగ్ చడ్ఢాను బ్రేక్ చేసిన చిత్రం

27 August 2022, 8:47 IST

    • లైగర్ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ మూవీ రివ్యూ సైట్ ఐఎండీబీ అత్యల్ప రేటింగ్‌ను ఇచ్చింది. 10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది.
లైగర్‌లో విజయ్ దేవరకొండ
లైగర్‌లో విజయ్ దేవరకొండ (Twitter)

లైగర్‌లో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం ఈ నెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రౌడీహీరో అభిమానులు తీవ్రంగా నిరాశకు లోనయ్యారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలు వరుసగా విఫలమవుతుండటంతో.. అక్కడ భారీగా అశలు పెట్టుకున్న చిత్రబృందానికి చేదు ఫలితాన్ని మిగిల్చింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లోనూ అత్యల్ప రేటింగ్‌ను దక్కించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

లైగర్ చిత్రానికి 10కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది ఐఎండీబీ. ఈ రేటింగ్ బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చడ్ఢా, రక్షా బంధన్, దొబారా చిత్రాలకంటే తక్కువ కావడం గమనార్హం. 2022లో విడుదలైన చిత్రాలన్నింటితో పోలిస్తే లైగర్‌కే అత్యల్ప రేటింగ్ ఇచ్చారు. బడ్జెట్ పరంగా, పాపులారిటీ పరంగా లైగర్ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే కంటెంట్ పరంగా పేలవంగా ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.

మొదటి రోజు వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమాకు క్రమేణా థియేటర్లలో అక్యూపెన్సీ తగ్గి కలెక్షన్లు భారీగా తగ్గాయి. చాలా కేంద్రాల్లో మొదటి వీకెండ్‌కే వసూళ్లు డ్రాప్ అవ్వడం గమనార్హం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. విడుదలైన సాయంత్రం కూడా సినిమా టాక్ కారణంగా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించకపోవడం ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వీకెండ్‌ రెండు రోజుల్లో సినిమా పుంజుకోవడంలో విఫలమైతే.. వసూళ్ల పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆమీర్ ఖాన్ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన లాల్ సింగ్ చడ్ఢాకు కూడా ఐఎండీబీ రేటింగ్ 5 ఇవ్వగా.. లైగర్‌కు మాత్రం 1.7 ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారా 2.9. రణ్‌బీర్ కపూర్ 4.9తో పోలిస్తే లైగర్‌కు అత్యంత పేలవమైన రేటింగ్ రావడం చిత్రబృందానికి షాక్ గురిచేస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ విధమైన స్పందన రావడంతో లైగర్ టీమ్ సైలెంట్ అయిపోయింది.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.