Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ - విజయ్‌కి హిట్టు పడిందా? ఓవర్‌సీస్ టాక్ ఎలా ఉందంటే?
05 April 2024, 6:10 IST
Family Star Twitter Review: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం రిలీజైంది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.
ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ
Family Star Twitter Review: గీతగోవిందం బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ స్టార్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. విజయ్, పరశురామ్ కలిసి గీతగోవిందం మ్యాజిక్ రిపీట్ చేశారా? ఫ్యామిలీ స్టార్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
కమర్షియల్ మైండ్‌సెట్‌తో వెళ్లొద్దు...
ఫ్యామిలీ స్టార్ లో విజయ్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. టైటిల్‌కు తగ్గట్టే కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ ఇదని, మాస్ కమర్షియల్ మైండ్‌సెట్‌తో థియేటర్‌కు వెళితే ఎంజాయ్ చేయలేరని సదరు అభిమాని ట్వీట్ చేశాడు. డౌట్ లేకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నాడు. విజయ్, మృణాల్ జోడీ అదుర్స్…విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీ, వారిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అని చెబుతున్నారు.
కమర్షియల్ అంశాలతో ఫస్ట్‌హాఫ్ ఎంజాయ్ చేసేలా ఉంటుందని, సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సెంటిమెంట్ సీన్స్ అన్ని ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా కన్వీన్సింగ్‌గా డైరెక్టర్ పరశురామ్ స్క్రీన్‌పై చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదుర్కొనే సమస్యలను ఫన్, సెంటిమెంట్ కలగలిపి చూపిస్తూ డైరెక్టర్ ఎంటర్‌టైన్ చేశాడని అంటున్నారు.
టీవీ సీరియల్‌లా...
ఫ్యామిలీ స్టార్‌కు నెగెటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. విజయ్ దేవరకొండ స్టోరీ సెలెక్షన్ పూర్ అని మరోసారి ఫ్యామిలీ స్టార్‌తో రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. రొటీన్ టెంప్లేట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇదని, రియల్ ఎమోషనల్ కనెక్షన్స్, ఫీల్‌గుడ్ మూవ్‌మెంట్స్ ఈ సినిమాలో మిస్సయ్యాయని వెంకీ రివ్యూస్ అనే నెటిజన్ తెలిపాడు.
టీవీ సీరియల్‌ను ఈ మూవీ గుర్తుకు తెస్తుందని అన్నాడు. విజయ్ దేవరకొండ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తే మంచిదని చెప్పాడు. గీతగోవిందం ఫార్ములాను కాపీ చేస్తూ దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించి డిసపాయింట్ చేశాడని తెలిపాడు.
సెకండాఫ్ బోరింగ్...
గీత గోవిందం మూవీకి మ్యూజిక్, కామెడీ ప్లస్ పాయింట్ అయ్యాయని, అదే రిపీట్ చేసి హిట్ కొట్టాలనే ప్రయత్నం పూర్తిగా మిస్ ఫైర్ అయ్యిందని అంటున్నారు. మ్యూజిక్ ఫ్యామిలీ స్టార్‌కు బిగ్గెస్ట్ మైనస్ అని కామెంట్స్ చేశారు. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుందని, కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లో బలం లేదని చాలా మంది నెటిజన్లు చెబుతున్నారు.
అనవసరమైన రిపీటెడ్ సీన్స్‌తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన పాత్రలన్నీ తెలిపోయానని, కామెడీని కూడా డైరెక్టర్ సరిగ్గా రాసుకోలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరో ఫ్యామిలీ ఎదుర్కొనే కష్టాల్లో సహజత్వం మిస్సయిందని పేర్కొంటున్నారు.