Pv Sindhu on Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు న‌చ్చ‌లేదు - పీవీ సింధు కామెంట్స్ వైర‌ల్‌-i dont like vijay deverakonda movies badminton star pv sindhu comments viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pv Sindhu On Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు న‌చ్చ‌లేదు - పీవీ సింధు కామెంట్స్ వైర‌ల్‌

Pv Sindhu on Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు న‌చ్చ‌లేదు - పీవీ సింధు కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 13, 2024 10:25 AM IST

Pv Sindhu on Vijay Devarakonda: టాలీవుడ్‌లో ప్ర‌భాస్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ‌గా చూస్తాన‌ని, వారి యాక్టింగ్ అంటే ఇష్ట‌మ‌ని పీవీ సింధు అన్న‌ది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల్లో కొన్ని న‌చ్చ‌లేద‌ని చెప్పింది.

పీవీ సింధు
పీవీ సింధు

Pv Sindhu on Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌పై బ్యాడింట‌న్ స్టార్ పీవీ సింధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో త‌న ఫేవ‌రేట్ హీరోలు ఎవ‌ర‌న్న‌ది కూడా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో పీవీ సింధు రివీల్ చేసింది. బ్యాడ్మింట‌న్ కార‌ణంగా ఎదుర‌య్యే ఒత్తిడి నుంచి దూరం కావ‌డానికి సినిమాలు బాగా చూస్తాన‌ని పీవీ సింధు అన్న‌ది. కొత్త పాత అనే తేడాలు లేకుండా అంద‌రి సినిమాలు చూస్తాన‌ని అన్న‌ది.

ప్ర‌భాస్ ఫేవ‌రేట్‌...

ప్ర‌భాస్ త‌న ఫేవ‌రేట్ హీరో అని చెప్పింది పీవీ సింధు. ప్ర‌భాస్ యాక్టింగ్ బాగుటుంద‌ని, అత‌డు న‌టించిన అన్ని సినిమాలు చూస్తాన‌ని సింధు అన్న‌ది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్‌తో మాట్లాడే అవ‌కాశం రాలేద‌ని చెప్పింది. ప్ర‌భాస్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అని పీవీ సింధు చెప్పింది. రామ్‌చ‌ర‌ణ్‌ను క‌లిసి చాలా మాట్లాడాన‌ని అన్న‌ది. ఒలింపిక్స్‌లో మెడ‌ల్‌ గెలిచిన త‌ర్వాత చిరంజీవి త‌న‌ను ఇంటికి పిలిచి స‌త్క‌రించార‌ని గుర్తుచేసుకున్న‌ది. పార్టీ కోసం కాకుండా చిరంజీవి ఇన్వైట్ చేయ‌డంతోనే స‌త్కారం కోస‌మే ఆయ‌న ఇంటికి వెళ్లిన‌ట్లు తెలిపింది. ఎన్టీఆర్ సినిమాలు, అత‌డి యాక్టింగ్ అన్న కూడా ఇష్ట‌మ‌ని సింధు అన్న‌ది. ఫేవ‌రేట్ హీరో అంటే ఒక్క పేరు చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని అన్న‌ది.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు న‌చ్చ‌వు...

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు కూడా చూశాన‌ని, వాటిలో కొన్ని న‌చ్చ‌లేద‌ని పీవీ సింధు అన్న‌ది. న‌చ్చ‌ని సినిమాలు ఏమిట‌న్న‌ది మాత్రం పీవీ సింధు రివీల్ చేయ‌లేదు. సినిమా హిట్ట‌వుతుందో, ఫ్లాప్ అవుతుందో తెలియ‌కుండా న‌టీన‌టులు కూడా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని, వారి క‌ష్టాన్ని త‌క్కువ చేయ‌డం స‌రికాద‌ని తెలిపింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై పీవీ సింధు చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

దీపికా ప‌డుకోణ్‌...

గ‌తంలో పీవీ సింధు సినిమాల్లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది ఈ పుకార్ల‌ను సింధు కొట్టిప‌డేసింది. . యాక్టింగ్ చేయాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని అన్న‌ది. బ్యాడ్మింట‌న్‌పైనే పూర్తిగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు చెప్పింది. బ్యాడ్మింట‌న్ కార‌ణంగా సినిమాల్లో న‌టించే టైమ్ కూడా త‌న‌కు లేద‌ని తెలిపింది. భ‌విష్య‌త్తులో సినిమాల విష‌యంలో త‌న నిర్ణ‌యం ఎలా ఉంటుందో చెప్ప‌లేన‌ని తెలిపింది.

ఒక‌వేళ త‌న బ‌యోపిక్ తెర‌కెక్కితే బ్యాడ్మింట‌న్ తెలిసిన దీపికా ప‌డుకోణ్ లాంటి హీరోయిన్ అయితే బెట‌ర్ అంటూ పీవీ సింధు కామెంట్స్ చేసింది. అప్ప‌ట్లో పీవీ సింధు కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. సింధు బ‌యోపిక్ తెర‌కెక్కిదే నిజ‌మేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఏమైందో ఏమో బ‌యోపిక్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు బ‌యోపిక్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

పీవీ సింధు రిట‌ర్న్స్‌

ప్ర‌స్తుతం ఆసియా టీమ్ ఛాంపియ‌న్స్‌పై పీవీ సింధు ఫోక‌స్ పెట్టింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో జ‌రిగిన ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింట‌ర్ టోర్నీలో సింధు గాయ‌ప‌డింది. మోకాలి గాయం కార‌ణంగా చాలా కాలం పాటు బ్యాడ్మింట‌న్‌కు దూర‌మైన సింధు ఆసియా టీమ్ ఛాంపియ‌న్స్‌తోనే తిరిగి బ‌రిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో ఇండియ‌న్ ఉమెన్స్ బ్యాడ్మింట‌న్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌లేషియా వేదిక‌గా మంగ‌ళ‌వారం నుంచి ఈ టోర్నీ మొద‌లుకానుంది. గ‌త సీజ‌న్‌లో ఆసియా టీమ్ ఛాంపియ‌న్స్‌లో భార‌త మెన్స్‌, ఉమెన్స్ టీమ్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిముఖం ప‌ట్టాయి.

టాపిక్