Hardik Pandya: ఇదేం చెత్త కెప్టెన్సీరా అయ్యా! పాండ్యపై నెటిజన్ల ట్రోలింగ్ - ఓటమికి కారణం అతడే!
Hardik Pandya: సన్‌రైజర్స్‌తో చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి పాండ్య చెత్త కెప్టెన్సీనే కారణమని మాజీ క్రికెటర్లతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Hardik Pandya: ఐపీఎల్ 2024లో వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకున్నది ముంబై ఇండియన్స్. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతితో ముంబై ఇండియన్స్ దారుణ ఓటమిని మూటగట్టుకున్నది. ముంబై బౌలర్లను చితక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్ ఇరవై ఓవర్లలో ఏకంగా 277 రన్స్ చేశారు. ఈ భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు ముంబై ధాటిగానే బ్యాటింగ్ చేసింది. కొండంత స్కోరు ముందు సన్‌రైజర్స్ పోరాటం సరిపోలేదు. ఇరవై ఓవర్లలో 246 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
24 రన్స్ మాత్రమే...
ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య దారుణంగా విఫలమయ్యాడు. 20 బాల్స్‌లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు పాండ్య తిలక్ వర్మ సిక్సర్లతో విరుచుకుపడగా పాండ్య మాత్రం భారీ షాట్స్ ఆడటానికే ఇబ్బంది పడ్డాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన పాండ్య నలభై ఆరు రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.
బుమ్రాను వాడుకోలేదు...
పాండ్య కెప్టెన్సీ కూడా ఈ మ్యాచ్‌లో గొప్పగా లేదు. ముంబై మెయిన్ బౌలర్ అయిన బుమ్రాను పాండ్య సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు నాలుగో ఓవర్‌ను బుమ్రా వేశాడు. ఆ ఓవర్‌లో అతడు కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఆ తర్వాత బుమ్రాను పక్కనపెట్టిన పాండ్య తానే బౌలింగ్ కొనసాగించాడు. మఫాకా, కోయిట్జ్ వంటి అనామక బౌలర్లకు అవకాశమిచ్చాడు. వారి బౌలింగ్‌ను సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్ హెడ్, అభిషేక్ చీల్చిచెండాడారు. ఆ తర్వాత 13 ఓవర్‌లో మళ్లీ బుమ్రాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేశారు. ముంబై బెస్ట్ బౌలర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడం బాగా లేదంటూ మ్యాచ్ జరుగుతోన్న సమయంలో టామ్ మూడీ ట్వీట్ చేశాడు.
120 స్ట్రైక్ రేట్...
పాండ్య కెప్టెనీ యావరేజ్‌గా ఉందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ముంబై బ్యాట్స్‌మెన్స్ అందరూ 200 స్ట్రైకింగ్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే కెప్టెన్ స్ట్రైక్ రేట్ మాత్రం 120 మాత్రమే ఉందంటూ సెటైర్ వేశాడు. అతడి ట్వీట్ వైరల్ అవుతోంది.
చెప్పులు విసిరిన ఫ్యాన్స్...
నెటిజన్లు కూడా పాండ్య కెప్టెన్సీ, ఆటతీరు వల్లే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాండ్య కెప్టెన్‌గా పనికిరాడని అన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాండ్య ఫొటో స్క్రీన్‌పై కనిపించగానే కోపంతో చెప్పులు విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
277 రన్స్...
ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. క్లాసెన్ 34 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 80 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ 63, హెడ్ 62 రన్స్‌తో ఆకట్టుకున్నారు. మార్‌క్రమ్ 42 రన్స్ చేశాడు. లక్ష్యఛేదనలో ముంబై ఇరవై ఓవర్లలో 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ 34 బాల్స్‌లో 64 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. టిమ్ డేవిడ్ 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.