(1 / 8)
Hardik Pandya: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఊహించని విజయాలు అందుకున్న హార్దిక్ పాండ్యాకు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మాత్రం తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అదే టైటన్స్ చేతుల్లో 6 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 168 రన్స్ చేయగా.. ముంబై 162 రన్స్ మాత్రమే చేయగలిగింది.
(AP)(2 / 8)
Hardik Pandya: ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యానే తొలి ఓవర్ వేయడం విశేషం. బుమ్రాకు ఇస్తారని అందరూ అనుకుంటే.. పాండ్యా మాత్రం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. అయితే చివరికి బుమ్రా వస్తేగానీ గుజరాత్ టైటన్స్ తొలి వికెట్ పడలేదు. సాహాను తన యార్కర్ తో బుమ్రా బోల్తా కొట్టించాడు.
(ANI)(3 / 8)
Hardik Pandya: ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ 39 బాల్స్ లోనే 45 రన్స్ చేశాడు. దీంతో గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్ 22 బాల్స్ లో 31 రన్స్ చేశాడు.
(AFP)(4 / 8)
Hardik Pandya: ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా రాణించాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.
(AFP)(5 / 8)
Hardik Pandya: చేజింగ్ లో ముంబై ఇండియన్స్ 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (43), డెవాల్డ్ బ్రెవిస్ (48) మూడో వికెట్ కు 77 పరుగులు జోడించి ముంబైను గెలిపించేలా కనిపించారు.
(ANI)(6 / 8)
Hardik Pandya: అయితే రోహిత్ ను సాయి కిశోర్ ఔట్ చేసిన తర్వాత బ్రెవిస్ కూడా పెవిలియన్ చేరడంతో చివర్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
(ANI)(7 / 8)
Hardik Pandya: గుజరాత్ టైటన్స్ బౌలర్లు మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ముంబై ఇండియన్స్ ను దెబ్బ తీశారు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ మాత్రమే చేయగలిగింది.
(AP)(8 / 8)
Hardik Pandya: చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయానికి 19 పరుగులు అవసరం అయ్యాయి. ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్ తో బాగానే స్టార్ట్ చేసినా.. తర్వాతి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి ముంబైని దెబ్బ తీశాడు ఉమేష్ యాదవ్. దీంతో 6 పరుగులతో ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు.
(AFP)ఇతర గ్యాలరీలు