తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Matka Ott: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే!

Matka OTT: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే!

14 October 2024, 10:47 IST

google News
    • Matka OTT Partner: మట్కా సినిమాకు ఓటీటీ డీల్ జరిగిపోయిందని సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్ ఆకట్టుకోవటంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
Matka OTT: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..
Matka OTT: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

Matka OTT: వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా చిత్రంపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గెటప్స్, యాక్టింగ్‍లో వేరియేషన్లు మెప్పించాయి. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీకి కరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. మట్కా మూవీకి మంచి క్రేజ్ రావటంతో ఓటీటీ డీల్ అప్పుడే జరిగింది.

ఏ ప్లాట్‍ఫామ్ చేతికి?

మట్కా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం. క్రేజ్ ఉండటంతో మంచి ధరకే కొనుగోలు చేసినట్టు టాక్. థియేట్రికల్ రన్ తర్వాత ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది.

మట్కా చిత్రం నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల తర్వాత ఈ చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చే అవకాశం ఉంటుంది. థియేట్రికల్ రన్‍ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అవుతుంది.

డిఫరెంట్ గెటప్‍ల్లో వరుణ్

1958-1982 మధ్య బ్యాక్‍డ్రాప్‍లో మట్కా మూవీ సాగుతుంది. విశాఖపట్టణంలో జూద క్రీడ మట్కా ఎలా విస్తరించిందనే అంశం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. మట్కా వాసు పాత్రను ఈ మూవీలో వరుణ్ తేజ్ పోషించారు. సాధారణ యువకుడు.. మట్కా కింగ్‍గా మారి నగరాన్ని ఎలా శాసించాడన్నది ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రంలో వరుణ్ కొన్ని డిఫరెంట్ గెటప్‍ల్లో కనిపించారు. యంగ్ లుక్స్‌తో పాటు ఓల్డ్ లుక్‍లోనూ మెప్పించారు. టీజర్లో వరుణ్ డైలాగ్ డెలివరీలో వేరియేషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. వింటేజ్ లుక్‍లో వావ్ అనిపించారు.

మట్కా సినిమాపై మేకర్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. పలాస చిత్రంతో ప్రశంసలు అందుకున్న కరుణ్ కుమార్.. ఈ మూవీని తెరకెక్కించారు. మరోసారి పీరియడ్ సబ్జెక్టుతో కథ రాసుకొని ఈ మూవీని రూపొందించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్టు పేర్కొన్నారు. మొత్తంగా టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు బాగానే పెరిగాయి.

మట్కా సినిమాను వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటించారు.

మట్కా చిత్రం వరుణ్ తేజ్‍కు చాలా కీలకంగా మారింది. గత రెండు చిత్రాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. వరుణ్‍కు భారీ డిజాస్టర్లను మిగిల్చాయి. దీంతో మట్కా హిట్ కావటం చాలా ముఖ్యంగా మారింది. ఈ మూవీ కోసం వరుణ్ చాలా కష్టపడినట్టు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. రొటీన్‍గా కాకుండా ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేయాలనే తాను అనుకుంటానని గతంలోనూ వరుణ్ చెప్పారు. పరాజయాలకు తాను కుంగిపోనని అన్నారు. అదే ఫాలో అయి మట్కా చేశారు. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని విశ్వాసంతో ఉన్నారు.

తదుపరి వ్యాసం