Operation Valentine OTT:ఓటీటీలో రిలీజైన వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?-operation valentine ott release date varun tej manushi chillar movie streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Operation Valentine Ott:ఓటీటీలో రిలీజైన వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Operation Valentine OTT:ఓటీటీలో రిలీజైన వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 22, 2024 10:05 AM IST

Operation Valentine OTT Streaming: వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ
వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ

Operation Valentine OTT Streaming: వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన దేశ‌భ‌క్తి మూవీ ఆప‌రేష‌న్ వాలెంటైన్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో వ‌రుణ్‌తేజ్ మూవీని రిలీజ్ చేశారు. ఆప‌రేష‌న్ వాలెంటైన్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

రెంట‌ల్ విధానంలో...

ఓటీటీ రిలీజ్‌లో ఆడియెన్స్‌కు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. రెంట‌ల్ విధానంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 279 రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది. ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైంది. 22 రోజుల గ్యాప్‌లోనే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

య‌థార్థ ఘ‌ట‌న‌ల‌తో...

పుల్వామా ఎటాక్‌తో పాటు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ బ్యాక్‌డ్రాప్‌లో య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ సినిమాను తెర‌కెక్కించాడు. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో స్వ్కాడ్రాన్ లీడ‌ర్‌గా వ‌రుణ్ తేజ్ న‌టించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా ఆప‌రేష‌న్ వాలెంటైన్ తెర‌కెక్కింది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, విజువ‌ల్స్ బాగున్నా క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టం, ఇదే పాయింట్‌తో గ‌తంలో ఫైట‌ర్‌, ఉరి వంటి సినిమాలు రావ‌డంతో ఆప‌రేష‌న్ వాలెంటైన్ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఈ మూవీతో వ‌రుణ్ తేజ్ ఖాతాలో మ‌రో ఫెయిల్యూర్ ప‌డింది. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ కేవ‌లం ఐదు కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.ఆపరేషన్ వాలంటైన్‌తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వ‌రుణ్‌తేజ్‌. హిందీలో భారీగా ప్ర‌మోష‌న్ చేసిన ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు.

అర్జున్ రుద్ర దేవ్ సాహ‌సం...

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు అర్జున్ రుద్ర దేవ్ (వ‌రుణ్ తేజ్‌) .ధైర్యం, దూకుడు ఎక్కువ‌. దేశ‌కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానికైన సిద్ధ‌ప‌డ‌తాడు. ఆప‌రేష‌న్ వ‌జ్ర కోసం అర్జున్ చేసిన సాహ‌సం కార‌ణంగా అత‌డి స్నేహితుడు క‌బీర్ ప్రాణాల‌ను కోల్పోతాడు. అర్జున్ కెరీర్ మ‌చ్చ‌గా అది మిగిలిపోతుంది.

2క‌శ్మీర్‌లో పుల్వ‌మాలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిపై ప్ర‌తీకారం తీర్చుకునే బాధ్య‌త‌ను ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అర్జున్‌కు అప్ప‌గిస్తుంది? ఉగ్ర‌వాదుల‌ను అర్జున్ ఎలా మ‌ట్టుపెట్టాడు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లో ఎలాంటి సాహ‌సాలు చేశాడు. ? ఈ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత ఇండియాను దెబ్బ‌కొట్టేందుకు పాక్ ఎలాంటి ఎత్తులు వేసింది? అస‌లు అప‌రేష‌న్ వాలెంటైన్ అంటే ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

మ‌ట్కా...

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీలో న‌వ‌దీప్‌, రుహాణి శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆప‌రేష‌న్ వాలెంటైన్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ మ‌ట్కా అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.