Operation Valentine: ప‌ద్మ‌విభూష‌ణ్ త‌ర్వాత చిరంజీవి రానున్న ఫ‌స్ట్ ఈవెంట్ ఫిక్స్ - వ‌రుణ్‌తేజ్ మూవీకి గెస్ట్‌...-chiranjeevi to attend varuntej operation valetine movie pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi To Attend Varuntej Operation Valetine Movie Pre Release Event

Operation Valentine: ప‌ద్మ‌విభూష‌ణ్ త‌ర్వాత చిరంజీవి రానున్న ఫ‌స్ట్ ఈవెంట్ ఫిక్స్ - వ‌రుణ్‌తేజ్ మూవీకి గెస్ట్‌...

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2024 02:55 PM IST

Operation Valentine Pre Release Event: వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు జ‌రుగ‌నుందంటే?

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Operation Valentine Pre Release Event: వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స‌యింది. ఫిబ్ర‌వ‌రి 25న ఆదివారం హైద‌రాబాద్‌లో ఈ వేడుక జ‌రుగ‌నుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నాడు. ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న త‌ర్వాత చిరంజీవి హాజ‌రుకానున్న ఫ‌స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌న ఫ్యామిలీ హీరో మూవీ వేడుక‌కు చిరంజీవి గెస్ట్‌గా రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌ద్మ‌విభూష‌ణ్ అందుకున్న త‌ర్వాత ఆప‌రేష‌న్ వాలెంటైన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఫ‌స్ట్ టైమ్ ఆడియెన్స్ ముందుకు రానుండ‌టంతో చిరంజీవి ఈ వేడుక‌లో ఏం మాట్లాడుతాడు అన్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవితో పాటు మ‌రికొంద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రుకానున్న‌ట్లు తెలిసింది.

స‌ల్మాన్‌ఖాన్‌, రామ్ చ‌ర‌ణ్‌...

తెలుగు, హిందీ భాష‌ల్లో మార్చి 1న ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ తెర‌కెక్కుతోంది. గ‌త కొన్నాళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిన వ‌రుణ్‌తేజ్ కెరీర్‌కు ఈ మూవీ కీల‌కంగా మారింది. దాంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ గ‌ట్టిగా చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్‌ను స‌ల్మాన్‌ఖాన్‌, రామ్‌చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా రానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌...

ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ తెర‌కెక్కుతోంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తోన్నారు. తెలుగుతో పాటు హిందీలో మార్చి 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

బాలీవుడ్ బ్యూటీ...

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అక్ష‌య్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్‌తో యాక్టింగ్ కెరీర్ మొద‌లుపెట్టిన మానుషి చిల్లార్ ఆప‌రేష‌న్ వాలెంటైన్‌తో తెలుగులో తొలి అడుగు వేస్తోంది. ఈ మూవీలో రుహాణిశ‌ర్మ‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి సందీప్ ముద్దా ఈ మూవీని నిర్మిస్తోన్నాడు.

హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ కార‌ణంగా...

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీని ఫిబ్ర‌వ‌రి 16న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో ఈ మూవీ వాయిదాప‌డింది. ఆప‌రేష‌న్ వాలెంటైన్ పోస్ట్‌పోన్‌కు హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ కూడా ఓ కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఫైట‌ర్‌, ఆప‌రేష‌న్ వాలెంటైన్ బ్యాక్‌డ్రాప్‌లు ఒక‌టే కావ‌డంతో రెండు సినిమాల రిలీజ్ మ‌ధ్య గ్యాప్ ఉండాల‌నే ఫిబ్ర‌వ‌రి 16 నుంచి మార్చి 1న ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

ఆప‌రేష‌న్ వాలెంటైన్‌కు ముందు వ‌రుణ్‌తేజ్ సోలో హీరోగా న‌టించిన గాండీవ‌ధారి అర్జున్‌, గ‌న సినిమాలు బాక్సాఫీస్ డిజాస్ట‌ర్ అయ్యాయి. గ‌త సినిమాల రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా వ‌రుణ్‌తేజ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆప‌రేష‌న్ వాలెంటైన్ త‌ర్వాత ప‌లాస 1978 ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌తో మ‌ట్కా అనే సినిమా చేస్తోన్నాడు వ‌రుణ్‌తేజ్‌. మ‌రో రెండు సినిమాలు ఈ ఏడాదే సెట్స్‌పైకిరానున్నాయి.

WhatsApp channel