యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస పరాజయాలను చూశారు. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలతో అతడికి నిరాశ ఎదురైంది. అయితే, వరుణ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. విశాఖపట్నం బ్యాక్‍డ్రాప్‍లో 1958-1982 మధ్య మట్కా ఆట కథాంశంగా వస్తున్న ఈ చిత్రానికి మంచి హైప్ ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీకి పలాస మూవీ ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మాట్కా చిత్రం టీజర్ నేడు (అక్టోబర్ 5) వచ్చేసింది.
ఈ చిత్రంలో మట్కా వాసు పాత్రను వరుణ్ తేజ్ పోషించారు. 1960- 80ల వింటేజ్ గెటప్‍ల్లో మట్కా టీజర్‌లో అదరగొట్టారు వరుణ్. ఇంటెన్సిటీతో పవర్‌ఫుల్‍గా కనిపించారు. డిఫరెంట్ గెటప్స్ వరుణ్‍కు బాగా సూటయ్యాయి. వేరియేషన్స్ మెప్పించేలా ఉన్నాయి.
“ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు నా లాంటోళ్లు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిలా మిగిలిపోకు” అని జైలులో వరుణ్‍తో రవి శంకర్ చెప్పే డైలాగ్‍తో మట్కా టీజర్ మొదలైంది.
“విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి.. లేదా వాసు గుర్తుకు రావాలి” అని వరుణ్ తేజ్ డైలాగ్ చెబుతారు. ఆ తర్వాత యంగ్ లుక్‍లో ఇంటెన్స్ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఆ తర్వాత ధనవంతుడు అయ్యాక సూటులో కనిపించారు. గుట్టలుగా పేర్చిన డబ్బుపై వరుణ్ పడుకొని నోట్లు విసిరేసే షాట్ ఉంది. హీరోయిన్లు నోరా ఫతేహి, మీనాక్షి చౌదరితో పాటు నవీన్ చంద్ర కూడా కనిపించారు.
ఓల్డ్ లుక్‍లో వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ డైలాగ్ ఉంది. “ధర్మం.. మనకు ఏది అవసరమో అదే ధర్మం. మనుషుల ఆశ చావనంత వరకు.. నా ఈ వ్యాపారానికి చావు ఉండదు” అనే ఇంటెన్స్ డైలాగ్ ఆకట్టుకుంది. యంగ్, ఓల్డ్ లుక్‍ల్లో వరుణ్ సూపర్ అనిపించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. వైజాగ్‍లో ఒకప్పుడు జూదక్రీడ అయిన మట్కా ఎంత ఎంత విపరీతంగా ఉండేదో.. ఒక వ్యక్తి ఎంతలా దీన్ని విస్తరించి ఆధిపత్యం చెలాయించారనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
మట్కా టీజర్లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. దర్శకుడు కరుణ కుమార్ టేకింగ్ మెప్పిస్తోంది. విజువల్స్ కూడా వింటేజ్ లుక్‍తో ఉన్నాయి. ఈ టీజర్‌తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
మట్కా మూవీ నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి ప్రొడ్యూజ్ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.