తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me First Song: స్టేజ్‍పై పాటపడిన దిల్‍రాజు, వైష్ణవి చైతన్య: వీడియో.. మెలోడియస్‍గా లవ్‍ మీ ఫస్ట్ సాంగ్

Love Me First Song: స్టేజ్‍పై పాటపడిన దిల్‍రాజు, వైష్ణవి చైతన్య: వీడియో.. మెలోడియస్‍గా లవ్‍ మీ ఫస్ట్ సాంగ్

30 March 2024, 17:29 IST

google News
    • Love Me Raavali Raa Song: లవ్ మీ సినిమా నుంచి తొలి పాట వచ్చేసింది. ‘రావాలి రా’ అంటూ మెలోడియస్‍గా ఉంది. అయితే, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‍లో వైష్ణవి చైతన్య, దిల్ రాజు కలిసి కొంత పాట పాడారు.
Love Me First Song: స్టేజ్‍పై పాటపడిన దిల్‍రాజు, వైష్ణవి చైతన్య: వీడియో.. మెలోడియస్‍గా లవ్‍ మీ ఫస్ట్ సాంగ్
Love Me First Song: స్టేజ్‍పై పాటపడిన దిల్‍రాజు, వైష్ణవి చైతన్య: వీడియో.. మెలోడియస్‍గా లవ్‍ మీ ఫస్ట్ సాంగ్

Love Me First Song: స్టేజ్‍పై పాటపడిన దిల్‍రాజు, వైష్ణవి చైతన్య: వీడియో.. మెలోడియస్‍గా లవ్‍ మీ ఫస్ట్ సాంగ్

Love Me Raavali Raa Song: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా ‘లవ్ మీ’ సినిమా రూపొందుతోంది. బేబి సినిమాతో సూపర్ పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్‍గా చేస్తున్నారు. దెయ్యంతో లవ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్ ఆసక్తిని రేపింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా, నేడు (మార్చి 30) లవ్ మీ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. రావాలి రా అంటూ మొదటి పాట వచ్చేసింది.

పాటపాడిన దిల్‍రాజు, వైష్ణవి

లవ్ మీ సినిమా నుంచి ‘రావాలి రా’ అంటూ ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో నేడు రిలీజ్ అయింది. ఈ సాంగ్ లాంచ్ కోసం ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత దిల్‍రాజు ఈ పాటను కొంచెం పాడారు.

ముందుగా ‘రావాలి రా’ పాటను దిల్‍రాజు హమ్ చేశారు. రాగం తీశారు. ఆ తర్వాత వైష్ణవి చైతన్య పాట అందుకున్నారు. ‘రావాలి రా.. రావాలి రా’ అంటూ పాట కొనసాగించారు. ఆ తర్వాత మరోసారి కాస్త హమ్ చేశారు దిల్‍రాజు. వీరిద్దరూ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

ఒరిజినల్ సాంగ్‍లోనూ వైష్ణవి వాయిస్

లవ్ మీ చిత్రంలో రావాలి రా పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‍ను అమల చంబోలు, గోమతి అయ్యర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా, సాయి శ్రేయ ఆలపించారు. అయితే, ఈ పాటలో కొంతభాగం వైష్ణవి చైతన్య కూడా పాడారు. దీంతో సింగర్‌గా ఇది వైష్ణవికి ఫస్ట్ సాంగ్‍గా ఉంది.

“రావాలి రా.. రావాలి రా.. నను చేరగా.. రా..రా” అంటూ ఈ పాట మొదలైంది. హీరో ఆశిష్‍ను దెయ్యం పిలుస్తున్నట్టుగా ఈ సాంగ్ ఉండనుంది. మంచి మెలోడియస్‍గా ఉన్న ఈ పాట బాగా పాపులర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సాంగ్‍తో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.

లవ్ మీ చిత్రం హారర్ లవ్ రొమాంటిక్ సినిమాగా రూపొందుతోంది. దెయ్యాన్ని యువకుడు ప్రేమించడం అనే అంశంపై ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రంతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కూడా పని చేస్తుండడం ఆసక్తికరంగా ఉంది.

లవ్ మీ సినిమా ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి, వైష్ణవితో పాటు రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. దిల్‍రాజు ప్రొడక్షన్స్, శిరీష్ ప్రెజెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

తదుపరి వ్యాసం