Love Me: ఆశిష్, వైష్ణవి చైతన్య కొత్త సినిమా టైటిల్ రివీల్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‍తో..-ashish reddy vaishnavi chaitanya romantic horror movie title love me mm keeravani music director dil raju producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me: ఆశిష్, వైష్ణవి చైతన్య కొత్త సినిమా టైటిల్ రివీల్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‍తో..

Love Me: ఆశిష్, వైష్ణవి చైతన్య కొత్త సినిమా టైటిల్ రివీల్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‍తో..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 07, 2024 04:36 PM IST

Love Me Movie: ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా వస్తోంది. ఈ చిత్రం టైటిల్‍ను మూవీ టీమ్ నేడు రివీల్ చేసింది. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

లవ్‍మీ సినిమాలో ఆశిష్ రెడ్డి
లవ్‍మీ సినిమాలో ఆశిష్ రెడ్డి

Love Me Movie: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి.. రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఆశిష్ హీరోగా కొత్త చిత్రం వస్తోంది. బేబీ సినిమాతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ చిత్రంగా ఆశిష్ - వైష్ణవి చిత్రం రానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 27) రిలీజ్ చేసింది.

ఆశిష్ - వైష్ణవి జోడీగా రూపొందుతున్న ఈ చిత్రానికి లవ్‍మీ (Love Me) టైటిల్ ఖరారు చేసింది మూవీ టీమ్. ఇఫ్ యూ డేర్ (ఒకవేళ ధైర్యం ఉంటే) అనే క్యాప్షన్ ఈ టైటిల్‍కు ఉంది. ముక్కలైన లవ్ సింబల్‍పై లవ్‍మీ టైటిల్ ఉంది.

అందమైన సరస్సుతో లవ్‍మీ టైటిల్ గ్లింప్స్ ఓపెన్ అయింది. ఆ తర్వాత శ్మశానం కనిపిస్తుంది. ఓ పెద్ద భవనం ఉంటుంది. ఆ తర్వాత ఆశిష్ రెడ్డి వెనుక ఓ అమ్మాయి దెయ్యంలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‍గా ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

స్టోరీ లైన్ ఇదే..

మనిషి, దెయ్యం మధ్య ప్రేమ అనే స్టోరీ లైన్‍తో లవ్‍మీ సినిమా వస్తోంది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. హారర్ రొమాటింక్ మూవీగా లవ్‍మీ రానుంది.

లవ్‍మీ సినిమా రిలీజ్ డేట్‍ను మూవీ యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ సమర్పిస్తున్నారు.

కీరవాణి, పీసీ శ్రీరామ్

లవ్‍వీ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. మంచి బడ్జెట్‍తోనే లవ్‍మీ మూవీని తీసుకొస్తున్నట్టు అర్థమవుతోంది.

లవ్‍మీ సినిమా స్క్రిప్ట్ వినగానే తనకు చాలా నచ్చిందని టైటిల్ రివీల్ ఈవెంట్‍లో దిల్‍రాజు చెప్పారు. ఆర్య సినిమా విన్నప్పుడు కలిగిన వైబ్స్ ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చాయని చెప్పారు. న్యూఏజ్ చిత్రంగా లవ్‍మీ వస్తోందని తెలిపారు.

బేబీ సినిమాతో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆనంద్ దేవరకొండతోనే మరో మూవీని ఆమె చేస్తున్నారు. ఈ సినిమా కూడా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగానే ఉండనుంది. ఇప్పుడు అశిష్‍తో లవ్‍మీ మూవీలో వైష్ణవి నటిస్తున్నారు. లవ్‍మీలో ఆమె దెయ్యం పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

ఆశిష్ రెడ్డి వివాహం

ఆశిష్ రెడ్డి పెళ్లి ఫిబ్రవరి 14వ తేదీన జైపూర్ వేదికగా ఘనంగా జరిగింది. అద్వైత రెడ్డిని అతడు వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‍లో అత్యంత గ్రాండ్‍గా జరిగింది. చాలా మంది సినీ సెలెబ్రిటీలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.