Vaishnavi Chaitanya: దిల్‍రాజు మేనల్లుడితో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమా: టైటిల్ ఇదే! మరో లవ్ స్టోరీ..-vaishnavi chaitanya next movie title reportedly confirmed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vaishnavi Chaitanya: దిల్‍రాజు మేనల్లుడితో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమా: టైటిల్ ఇదే! మరో లవ్ స్టోరీ..

Vaishnavi Chaitanya: దిల్‍రాజు మేనల్లుడితో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమా: టైటిల్ ఇదే! మరో లవ్ స్టోరీ..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 24, 2023 06:47 PM IST

Vaishnavi Chaitanya: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా చేయనున్న సినిమాలో వైష్ణవి చైతన్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేసేశారని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya: బేబి సినిమాతో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతమైన పాపులారిటీ సాధించారు. అందం, అభినయంతో మెప్పించారు. ఆ చిత్రంలో వైష్ణవి నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. వరుసగా ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి. బేబి తర్వాత ఆమె ఆనంద్ దేవకొండతో మరో సినిమా చేస్తున్నారు. కాగా, వైష్ణవి చైతన్య మరో చిత్రానికి కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా నటించనున్నారు.

yearly horoscope entry point

దిల్‍రాజు అల్లుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు అతడు రెండో చిత్రానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని కూడా దిల్‍రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాకు హీరోయిన్‍గా వైష్ణవి చైతన్యను దిల్‍రాజు ఎంపిక చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

టైటిల్ ఇదేనా?

ఆశిష్ రెడ్డి - వైష్ణవి చైతన్య కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి టైటిల్‍ను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘లవ్ మీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ మూవీ ప్రకటన సమయంలోనే టైటిల్‍ను కూడా రివీల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

వైష్ణవి చైతన్య ఫస్ట్ మూవీ బేబి.. ట్రయాంగిల్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. వైష్ణవితో పాటు ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆశ్విన్ ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆనంద్ దేవరకొండ - వైష్ణవి నటిస్తున్న తదుపరి సినిమా కూడా లవ్ స్టోరీగానే ఉండనుంది. ఇక, ఆశిష్ రెడ్డి - వైష్ణవి సినిమా కూడా లవ్ స్టోరీగానే రూపొందనుంది. దీంతో వరుసగా మూడో ప్రేమ కథలో వైష్ణవి యాక్ట్ చేయనున్నారు.

ఆశిష్ - వైష్ణవి చిత్రానికి కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది.

Whats_app_banner