Baby Combination: బేబి కాంబినేషన్‍ రిపీట్.. మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి-baby combo anand deverakoda vaishnavi chaitanya teaming again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baby Combination: బేబి కాంబినేషన్‍ రిపీట్.. మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

Baby Combination: బేబి కాంబినేషన్‍ రిపీట్.. మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 20, 2023 07:04 PM IST

Baby Combination: బేబి సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటించనున్నారు. ఆ వివరాలు ఇవే.

Baby Combination: బేబి కాంబినేషన్‍ రిపీట్.. మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి
Baby Combination: బేబి కాంబినేషన్‍ రిపీట్.. మళ్లీ జోడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

Baby Combination: బేబి సినిమా ఈ ఏడాది సంచలన విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా రూ.90కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ట్రయాంగిల్ హార్డ్ హిట్టింగ్ లవ్ డ్రామాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాగా, ఇప్పుడు బేబి మూవీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మరోసారి జోడీగా నటించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాలివే..

కల్ట్ బ్లాక్‍బాస్టర్ బేబి కాంబో మళ్లీ వచ్చేస్తోందంటూ మాస్ మూవీ మేకర్స్ నేడు (అక్టోబర్ 20) ట్వీట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథను మాత్రమే అందిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించనున్నారు. అలాగే, బేబి చిత్రాన్ని నిర్మించిన ఏస్‍కేఎన్.. ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. అలాగే, అమృత ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది.

బేబి చిత్రానికి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని మాస్ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈ నయా సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వెల్లడించింది. కన్నీరు పెట్టుకుంటున్న వైష్ణవి చైతన్యను ఆనంద్ దేవరకొండ ఓదారుస్తున్నట్టు పోస్టర్లో కనిపిస్తోంది. ఇది కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండే అవకాశం ఉంది.

కాగా, ఈ ఏడాది జూలైలో రిలీజ్ అయిన బేబి సినిమా మంచి విజయాన్ని సాధించింది. చిరంజీవి, అల్లు అర్జున్ సహా చాలా మంది ప్రముఖుల ప్రశంసలను ఈ సినిమా పొందింది. కలెక్షన్లలోనూ సత్తాచాటింది. మొత్తంగా సుమారు రూ.95కోట్లకుపైగా కలెక్షన్లను బేబి సాధించింది. ఆహా ఓటీటీలోనూ ఈ సినిమా అదరగొట్టింది. ఓటీటీ రికార్డులను నెలకొల్పింది.

IPL_Entry_Point