Malayalam: మలయాళంలో తీసి తెలుగులో డబ్ చేయండి, అప్పుడే చూస్తారు: హీరో షాకింగ్ కామెంట్స్
12 May 2024, 13:56 IST
Mohan Bhagath About Aarambham Movie Malayalam: సినిమాను మలయాళంలో తీసి తెలుగులో డబ్ చేయమని, అప్పుడే సినిమాలు చూస్తారని, లేకుంటే రెస్పాన్స్ రాదని చెప్పారని హీరో మోహన్ భగత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆరంభం మూవీ సక్సెస్ మీట్‌లో తెలుగు సినిమాల రెస్పాన్స్‌పై ఈ విధంగా మాట్లాడారు.
మలయాళంలో తీసి తెలుగులో డబ్ చేయండి, అప్పుడే చూస్తారు: హీరో షాకింగ్ కామెంట్స్
Mohan Bhagath Aarambham Success Meet: కేరాఫ్ కంచరపాలెం, మను సినిమాలతో నటుడిగా గుర్తింపు పొందాడు మోహన్ భగత్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆరంభం. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మించిన ఈ సినిమాలో సుప్రిత నారాయణ్ హీరోయిన్‌గా మోహన్ భగత్‌కు జోడీగా చేసింది.
ఈ చిత్రానికి వి అజయ్ నాగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఆరంభం మువీ మే 10న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా మే 11న ఆరంభం మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన ఆసక్తకిర విశేషాలను చెప్పాడు హీరో మోహన్ భగత్.
"ఆరంభం మూవీని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్. మేము ఈ సినిమా చేసేప్పుడు ఇలాంటివి మలయాళంలో చేసి తెలుగులో డబ్ చేయండి. అప్పుడు మన వాళ్లు చూస్తారు. ఇలా నేరుగా తెలుగులో చేస్తే అంతగా రెస్పాన్స్ ఉండదు అన్నారు. కానీ, మేము ఈ కథను నమ్మాం. తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని బిలీవ్ చేశాం" అని హీరో మోహన్ భగత్ తెలిపాడు.
"ఆరంభం రిలీజ్ రోజున మార్నింగ్, మ్యాట్నీ షోస్‌కు భయం వేసింది. కానీ, ఈవినింగ్ నుంచి కలెక్షన్స్ పికప్ అయ్యాయి. మీడియా మాకు బాగా సపోర్ట్ చేసింది. రివ్యూస్ ఎంకరేజింగ్‌గా వచ్చాయి. మీరు ఆరంభం మూవీని ఫ్యామిలీతో కలిసి చూడండి ఎంజాయ్ చేస్తారు" అని ఆరంభం సినిమా హీరో మోహన్ భగత్ చెప్పుకొచ్చాడు.
"అజయ్, అభిషేక్, మోహన్, సింజిత్.. ఇలా ఆరంభం కొత్త వాళ్లు చేసిన సినిమా అయినా అలా ఉండదు. ఎక్సీపీరియన్స్ ఉన్న వాళ్లు తీసిన సినిమాలా ఉంటుంది. ఇప్పుడు థియేటర్స్‌కు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదు. కానీ, కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయత్నానికి ఆడియెన్స్ సపోర్ట్ ఇవ్వాలి. క్రమంగా మా మూవీకి ప్రేక్షకుల రాక మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నాం" అని నమ్మకంగా మాట్లాడారు నటుడు భూషణ్ కల్యాణ్.
"మా మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. రివ్యూస్ కూడా అప్రిషియేట్ చేస్తూ వచ్చాయి. నా ఫేవరేట్ రివ్యూవర్స్ చాలా మంది మూవీ బాగుందని రాశారు. నాకు తెలిసిన డైరెక్టర్స్ కూడా నిన్న సినిమా చూసి వాళ్లకు నచ్చిందని చెప్పారు" అని ఆరంభం సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి తెలిపారు.
"చిన్న సినిమాకు ఓపెనింగ్స్ భారీగా ఉండవు. కానీ, మెల్లిగా పికప్ అవుతాయి. నిన్న సాయంత్రం నుంచి మౌత్ టాక్ పెరిగింది. శని, ఆదివారాలు వీకెండ్ మీరు ఆరంభం మూవీ చూడండి. రెండు గంటల పద్నాలుగు నిమిషాలే నిడివి. సెకండాఫ్ అయితే మీకు తెలియకుండా కంప్లీట్ అవుతుంది. మంచి ప్లెజెంట్ మూవీ మీరు థియేటర్‌లో చూస్తే ఎంజాయ్ చేస్తారు" అని మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమిల్లి చెప్పారు.
టాపిక్