తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriller Movie Youtube: ఫ్రీగా యూట్యూబ్‌లోకి వచ్చిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో..

Thriller Movie Youtube: ఫ్రీగా యూట్యూబ్‌లోకి వచ్చిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో..

Hari Prasad S HT Telugu

04 September 2024, 12:32 IST

google News
    • Thriller Movie Youtube: ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఫ్రీగా యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చింది. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా హక్కులు ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రీగా యూట్యూబ్‌లోకి వచ్చిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో..
ఫ్రీగా యూట్యూబ్‌లోకి వచ్చిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో..

ఫ్రీగా యూట్యూబ్‌లోకి వచ్చిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో..

Thriller Movie Youtube: యూట్యూబ్‌లోకి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. నిజానికి ఈ సినిమా ఇలా రిలీజ్ కావడం వెనుక పెద్ద స్టోరీయే ఉంది. ఇండియాలో అతిపెద్ద ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీని ఏ ఓటీటీ కొనకపోవడంతో చివరికి ఫ్రీగా యూట్యూబ్ లోకే తీసుకొచ్చారు. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.45 వేలు రావడం గమనార్హం.

యూట్యూబ్‌లోకి ది లేడీ కిల్లర్

మనం మాట్లాడుకుంటున్న ఆ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ పేరు ది లేడీ కిల్లర్. బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. ఇండియా వ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే వేయగా.. 293 టికెట్లు అమ్ముడుపోయాయి. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర రూ.38 వేలు మాత్రమే వచ్చాయి.

గతేడాది నవంబర్లో రిలీజైన ఈ సినిమా డిజిటల్ హక్కులను నిజానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మూవీని గతేడాది డిసెంబర్లోనే ఓటీటీలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో షూటింగ్ పూర్తి కాకుండానే నవంబర్లోనే థియేటర్లలో రిలీజ్ చేసినట్లూ వార్తలు వచ్చాయి. అలాంటి మూవీని చివరికి ఆ నెట్‌ఫ్లిక్స్ కూడా పక్కన పెట్టడంతో చేసేది లేక మేకర్స్ ది లేడీ కిల్లర్ ను నేరుగా యూట్యూబ్ లోకి తీసుకొచ్చారు.

అలా పది నెలల తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 3) నుంచి ఈ డిజాస్టర్ సినిమా ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడా పెద్దగా మూవీకి ఆదరణ లభించడం లేదు. రెండు రోజుల్లో 4 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి.

యూట్యూబ్‌లోనూ ట్రోలింగ్

ది లేడీ కిల్లర్ మూవీకి యూట్యూబ్ లోనూ ట్రోలింగ్ తప్పడం లేదు. ఈ సినిమా చూసిన కొందరు కామెంట్స్ సెక్షన్లో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఫ్రీగా చూపించినా ఎవరూ చూడని విధంగా సినిమా తీయడం అంటే ఇదీ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

ఈ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన టీసిరీస్ కు ఇదే చివరి రోజు అవుతుంది అని మరో యూజర్ అన్నాడు. ఈ మూవీతో ఇండియన్ సినిమానే ఫెయిలైందని ఇంకో యూజర్ కాస్త ఘాటుగానే స్పందించాడు. సినిమాను అసంపూర్తిగా ముగించడాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ది లేడీ కిల్లర్.. బిగ్గెస్ట్ ఫ్లాప్

ఈ సినిమాలో నటించిన అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ఈ మూవీ ప్రమోషన్లు చేయమని తేల్చి చెప్పారు. దీంతో అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందనే ఎవరికీ తెలియదు. ఒక్క ట్రైలర్ తప్ప మూవీ నుంచి ఏ అప్డేట్ బయటకు రాలేదు. సినిమా ఇంత దారుణంగా రిలీజ్ కావడాన్ని మేకర్స్ జీర్ణించుకోలేకపోయారు.

ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ సినిమాకు కేవలం రూ.45 వేలు మాత్రమే వచ్చాయి. ఇటు ఓటీటీ హక్కులు కూడా ఎవరూ తీసుకోకపోవడంతో మేకర్స్ ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయారు.

తదుపరి వ్యాసం