Prabhas Biggest Flop Movies : ప్రభాస్ పేరుపై ఇండియాలో చెత్త రికార్డు.. 2 బిగ్గెస్ట్ ఫ్లాప్స్.. ఏంటిది డార్లింగ్?
Biggest Box Office Flop Movies In India : డార్లింగ్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత మంచి సినిమా పడలేదు. ఒకవేళ పడి ఉంటే.. రేంజ్ వేరేలా ఉండేది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియానే. అయితే ఏ ఒక్కటి కూడా సరిగా ఆడలేదు. ఇందులో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్(Prabhas) రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ తర్వాత చేసిన సినిమాలేవీ.. ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా లేవు. ఒక్కటి కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా(Adipurush) కుడా అంతే. దీంతో సలార్, కల్కి ఏడీ2989పై ఆశలు పెట్టుకున్నాడు. సరైన కథతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభాస్ చేసిన సినిమాల బడ్జెట్ భారీగానే ఉంటుంది. దీంతో సినిమా పోతే.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
నిజానికి కొన్ని రోజులుగా ఇండియాలో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద అవి బోల్తా కొడుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు దారుణంగా విఫలమవుతున్నాయి. దీంతో మేకర్స్ భారీ నష్టాల్లోకి కూరుకుపోతున్నారు. రణబీర్ కపూర్ షంషేరా, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, ప్రభాస్ ఆదిపురుష్(Prabhas Adipurush) వంటి చిత్రాలకు కోట్లలో ఖర్చు చేశారు. కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ పొందడంలో ఆ సినిమాలు విఫలమయ్యాయి. నష్టాల పరంగా వీటన్నింటితోపాటు మరో సినిమా కూడా ఉంది.
ఆదిపురుష్ సినిమాకు 550 నుంచి 600 కోట్ల వరకూ ఖర్చు అయిందని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాకు వచ్చిన నెట్ వసూళ్లు ఎంతో తెలుసా? 288 కోట్లు, ఓవర్సిస్ లో 35 కోట్ల వరకూ వచ్చాయి. మెుత్తం వసూళ్లు 325 కోట్లు అంటున్నారు. అంటే సుమారు 225 కోట్ల వరకూ నష్టాన్ని మిగిల్చింది ఆదిపురుష్. ఈ సినిమా ఓటీటీ(OTT)లో విడుదలైనా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఓటీటీలోనూ ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాను ఆదరించడం లేదు.
అది ఆదిపురుష్ సినిమా మాత్రమే కాదు. ప్రభాస్ మరో చిత్రం కూడా అతిపెద్ద ఫ్లాప్ అనే ప్రచారాన్ని మూటగట్టుకుంది. ఆ సినిమా మరేదో కాదు రాధే శ్యామ్. పూజా హెగ్డే, ప్రభాస్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 2022లో విడుదలైంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.130 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు రూ. 170 కోట్ల నష్టాలను మిగిల్చింది. అంటే ఇండియాలో వరుసగా ఒకటి, రెండు బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఇచ్చిన చెత్త రికార్డు ప్రభాస్ పేరుపై ఉంది. అయితే కథ ఎంచుకునే విషయంలో తడబడటమే ప్రభాస్ చేసిన తప్పైంది. దీంతో డార్లింగ్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మంచి కథలు ఎంచుకోవచ్చు కదా అంటున్నారు.
రాధాకృష్ణ దర్శకత్వం వహించిన రాధేశ్యామ్(Radheshyam) కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సత్యరాజ్, జగపతి బాబు, కృష్ణం రాజు, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, జయరామ్ వంటి నటులు కూడా ఉన్నారు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
మరో పెద్ద ఫ్లాప్ అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.140 కోట్ల నష్టాలను చవిచూసింది. 2022లో విడుదలైన మరో అతిపెద్ద ఫ్లాప్ రణబీర్ కపూర్ నటించిన షంషేరా. దాదాపు 100 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది. భారతీయ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఆచార్య (రూ. 80 కోట్లు), కన్నడ చిత్రం కబ్జా (రూ. 80 కోట్లు), అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా (రూ. 70 కోట్లు), థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ (రూ. 60 కోట్లు) వంటి ఇతర పెద్ద ఫ్లాప్‌లు సినిమాలు ఉన్నాయి..!