Thalapathy Vijay Re-release movie: రీరిలీజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న దళపతి విజయ్ మూవీ.. రజనీకాంత్‌నే మించిపోయాడు
30 April 2024, 11:57 IST
- Thalapathy Vijay Re-release movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గిల్లీ మూవీ రీరిలీజ్ లోనూ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మధ్యే రిలీజైన రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాను కూడా మించిపోవడం గమనార్హం.
రీరిలీజ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న దళపతి విజయ్ మూవీ.. రజనీకాంత్‌నే మించిపోయాడు
Thalapathy Vijay Re-release movie: తమిళనాడులో దళపతి విజయ్ కి ఉన్న రేంజ్ ఏంటో మరోసారి నిరూపిస్తోంది అతని 20 ఏళ్ల కిందటి మూవీ గిల్లీ. 2004లో రిలీజైన ఈ సినిమా.. ఈ ఏడాది ఏప్రిల్ 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీరిలీజ్ లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న రికార్డులు ఆశ్చర్యపరుస్తున్నాయి.
గిల్లీ రీరిలీజ్ కలెక్షన్లు
దళపతి విజయ్, త్రిష కృష్ణన్ నటించిన ఈ గిల్లీ మూవీ 2004లో తొలిసారి రిలీజైంది. ఈ సినిమా తెలుగులో మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ హిట్ ఒక్కడు మూవీకి రీమేక్ కావడం విశేషం. అప్పడు తమిళ రీమేక్ కూడా హిట్ అయింది. అయితే రీరిలీజ్ లోనూ ఇండియాలో మరే సినిమాకు దక్కనన్ని వసూళ్లు వస్తుండటమే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం.
ఏప్రిల్ 20న రీరిలీజైన ఈ మూవీ 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.26.5 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ తొలి 9 రోజుల యూకే, ఇండియా కలెక్షన్లను ఈ గిల్లీ మూవీ రీరిలీజ్ లో దాటేసిందంటే విజయ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాల్ సలామ్ మూవీ ఇండియాలో కేవలం రూ.17.5 కోట్లే వసూలు చేసింది.
అదే సమయంలో గిల్లీ మాత్రం 9 రోజుల్లోనే ఇండియాలో రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో మరో రూ.6.5 కోట్లు వచ్చాయి. ఈ గిల్లీ మూవీ చూస్తూ థియేటర్లో అభిమానులు డ్యాన్స్ లు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గిల్లీ రికార్డులు
ఓ రీరిలీజ్ మూవీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచిందంటే నమ్మగలరా? ఇప్పటికే గిల్లీ మూవీ రజనీకాంత్ లాల్ సలామ్ నెట్ కలెక్షన్లను అధిగమించేసింది. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న అయలాన్ కలెక్షన్లను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయలాన్ మూవీ రూ.49.5 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
గిల్లీ ఓ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఈ మూవీ రీరిలీజ్ లో ఈ వారంలోనే రూ.30 కోట్ల మార్క్ అందుకోనుంది. నిజానికి 2004లో రిలీజైనప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డును రీరిలీజ్ లో బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అద్భుతమనే చెప్పాలి. 2003లో మహేష్ బాబు, భూమిక నటించిన ఒక్కడు సినిమాకు ఇది రీమేక్.
తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ కబడ్డీ ప్లేయర్.. కర్నూలు వెళ్లి అక్కడి ఫ్యాక్షనిస్టును కొండారెడ్డి బుర్జు దగ్గరే కొట్టి ఓ అమ్మాయిని కాపాడి తీసుకురావడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. తెలుగులో గుణశేఖర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సినిమా స్టోరీ, మ్యూజిక్, కామెడీ, యాక్షన్ అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి.
టాపిక్