Thalapathy Vijay: దళపతి విజయ్‌పై కవిత రాసిన అభిమాని.. 36 గంటల కష్టం, పదివేల పదాల కవిత్వం-thalapathy vijay fan wrote poetry with 10 thousand words in 36 hours and kadiravel get awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: దళపతి విజయ్‌పై కవిత రాసిన అభిమాని.. 36 గంటల కష్టం, పదివేల పదాల కవిత్వం

Thalapathy Vijay: దళపతి విజయ్‌పై కవిత రాసిన అభిమాని.. 36 గంటల కష్టం, పదివేల పదాల కవిత్వం

Sanjiv Kumar HT Telugu
Apr 22, 2024 01:54 PM IST

Fan Poetry To Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ కోసం ఓ అభిమాని ఊహించని సాహసం చేశాడు. 36 గంటల పాటు కష్టపడి విజయ్ కోసం ఓ కవిత రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

దళపతి విజయ్‌పై కవిత రాసిన అభిమాని.. 36 గంటల కష్టం, పదివేల పదాల కవిత్వం
దళపతి విజయ్‌పై కవిత రాసిన అభిమాని.. 36 గంటల కష్టం, పదివేల పదాల కవిత్వం

Thalapathy Vijay Fan Poetry: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తమిళనాట మాత్రమే కాకుండా కేరళ, పుదుచ్చెరి, దేశం మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోను విజయ్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఏపీ, తెలంగాణలో ఎప్పుడూ రిలీజ్ కావడమే కాకుండా మంచి కలెక్షన్స్ సైతం వసూలు చేస్తుంటాయి.

గతేడాది సంక్రాంతికి

అందుకే ప్రముఖ పండుగల సమయంలో టాలీవుడ్ హీరోలతో పాటు విజయ్ సినిమాలను సైతం రిలీజ్ చేస్తుంటారు. అందుకు ఉదాహరణ గతేడాది సంక్రాంతికి విడుదలైన వారసుడు సినిమానే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

8 కోట్ల కలెక్షన్స్

ఇదిలా ఉంటే, తాజాగా ఓ అభిమాని విజయ్‌కు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. 2004లో విజయ్ నటించిన గిల్లీ సినిమా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. గిల్లీ మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి సినమాను విడుదల చేశారు. ఈ సినిమా దాదాపుగా రూ. 8 కోట్ల కలెక్షన్స్ సాధించి రీ రిలిజ్ మూవీస్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

పదివేల పదాలతో కవిత్వం

ఈ సందర్భంగా తిరుప్పతూర్ సమీపంలోని జడైయనేర్‌కు చెందిన కదిరవేల్ అనే దళపతి విజయ్ ఫ్యాన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ గురించి 10 వేల పదాలతో ఓ కవిత రాశాడు. దానికోసం సుమారు 36 గంటల పాటు కష్టపడ్డాడు సదరు అభిమాని కదిరవేల్. దీనికి కదిరవేల్ పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు.

సాహసమనే చెప్పాలి

విజయ్ అభిమాని కదిరవేల్‌కు కేరళ రాష్ట్రానికి చెందిన యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫ్యూచర్ కలామ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ వరించాయి. ఈ విషయం తెలిసి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ కాలంలో అభిమాన హీరో కోసం 36 గంటలు శ్రమించి, కవిత రాయడమంటే సాహసమనే చెప్పాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ

కాగా విజయ్ ఈ మధ్యే రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీ కూడా స్థాపించాడు విజయ్. ప్రస్తుతం గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్‌పై సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా గోట్ రానుంది.

4కె వెర్షన్‌తో రిలీజ్

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇక విజయ్, త్రిష జంటగా నటించిన సినిమానే గిల్లీ. 2004లోని ఈ బ్లాక్ బస్టర్ సినిమాను 4కె వెర్షన్‌తో తమిళనాడుతో పాటు యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి మరికొన్ని దేశాల్లోని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.

సినిమాలు లేనందున

దీంతో విజయ్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని, పండుగ వాతావరణాన్ని కలిగించింది. తమిళనాట పెద్దగా సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో థియేటర్లకు డ్రై వీక్ అయిపోయింది. ఈ క్రమంలో గిల్లీ మళ్లీ విడుదల కావడంతో థియేటర్ యాజమాన్యానికి మంచి కలెక్షన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point