Lal Salaam OTT Release Date: లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన రజనీ మూవీ-lal salaam ott release date announced sunxt to stream the movie from april 12th rajinikanth aishwarya rajnikanth movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Ott Release Date: లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన రజనీ మూవీ

Lal Salaam OTT Release Date: లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన రజనీ మూవీ

Hari Prasad S HT Telugu

Lal Salaam OTT Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని సన్ నెక్ట్స్ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది.

లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన రజనీ మూవీ

Lal Salaam OTT Release Date: లాల్ సలామ్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫమ్ అయింది. మొత్తానికి థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ విషయాన్ని సన్ నెక్ట్స్ (SuNXT) సోమవారం (ఏప్రిల్ 8) అధికారికంగా వెల్లడించింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా రానుంది.

లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్

సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ ఈ శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచే సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు తమిళ కొత్త ఏడాది కూడా ఉండటం విశేషం. ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. అయితే తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమా.. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. నెల రోజులుగా ప్రతి వారం లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్తలు వస్తున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే నాలుగు వారాల్లో వస్తున్న వేళ ఈ మూవీ ఎందుకు రావడం లేదని రజనీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మొత్తానికి రెండు నెలల తర్వాత ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

లాల్ సలామ్ డిజాస్టర్

రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్, కలెక్షన్లు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రజనీ అతిథి పాత్రపై భారీ ఆశలు పెట్టుకున్నా అదీ వర్కౌట్ కాలేదు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది.

లాల్ సలామ్ మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊళ్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. సినిమా ప్రమోషన్లను కూడా బాగానే చేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. ఇవేవీ కూడా మూవీని కాపాడలేకపోయాయి.

ముఖ్యంగా తెలుగులో అయితే మరీ దారుణం. తొలి వారంలో లాల్ సలామ్ తెలుగు కలెక్షన్లు కేవలం రూ.90 లక్షలుగా మాత్రమే ఉన్నాయి. ఇక తమిళం, తెలుగు కలిపినా ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రూ.13 కోట్ల షేర్ కలెక్షన్లు మాత్రమే రావడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొంది.. రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాకు ఈ కలెక్షన్లు చాలా దారుణమనే చెప్పాలి. మరి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.