Om Bheem Bush OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-om bheem bush ott release date announced prime video to stream the movie from april 12th ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Om Bheem Bush Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Om Bheem Bush OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Apr 08, 2024 12:36 PM IST

Om Bheem Bush OTT Release Date: సూపర్ హిట్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇదే
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇదే

Om Bheem Bush OTT Release Date: థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది సూపర్ హిట్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని సోమవారం (ఏప్రిల్ 8) అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ డేట్

ఓం భీమ్ బుష్ మూవీ వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను తాము దక్కించుకున్నట్లు మూవీ రిలీజ్ కు ముందే చెప్పిన ప్రైమ్ వీడియో.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ తేదీని వెల్లడించింది. శ్రీహర్ష కోనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

"ముగ్గురు శాస్త్రవేత్తలు.. ఓ వైల్డ్ ట్రెజర్ హంట్.. గందరగోళం ఖాయం" అనే క్యాప్షన్ తో ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ సినిమా ముగ్గురు డాక్టరేట్లు అయిన క్రిష్, వినయ్, మాధవ్ లచుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

20 రోజుల్లోనే ఓటీటీలోకి..

మార్చి 22న ఓం భీమ్ బుష్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ క్యాప్షన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. దానికితగినట్లుగానే సినిమా లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది. సినిమా ఫస్టాఫ్‌ అంతా కాలేజీ సీన్లతో నవ్వులు పంచాయి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టారు. అయితే కథ పరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. నవ్వించడంలో మరోసారి బ్రోచెవారెవరురా కాంబోను రిపీట్ చేశారు.

ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. లాజిక్‌ను పక్కన పెట్టి కేవలం కామెడీని చూస్తే మాత్రం హాయిగా నవ్వుకోవచ్చు. ఈ సినిమా తొలి రోజు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కూడా ఆడియెన్స్ పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు.

హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓ నవ్వుల సునామీ అంటూ కొందరు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. ఇందులో నటించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీతో కుమ్మి అవతలపారేశారంటూ కూడా కామెంట్స్ వచ్చాయి. ఈ పాజిటివ్ టాక్ తోపాటు సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.4.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం.

ఇక మూడు రోజుల్లోనే ఈ మూవీ లాభాల్లోకి దూసుకెళ్లింది. మూడు రోజుల్లోనే రూ.17 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. రూ.10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోరూపొందిన ఈ సినిమాకు మంచి లాభాలే వచ్చాయి.

IPL_Entry_Point