Bhavanam Movie Teaser Released: తెలుగు సినీ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలు అయినా మంచి పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ ఉల్లాల్. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ భవనమ్. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
స్నేహ ఉల్లాల్‌తోపాటు పాపులర్ కమెడియన్స్ సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ భవనమ్ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల భవనమ్ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి, అజయ్ ఇలా ప్రధాన తారాగణం అంతా స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్స్‌తో చూస్తుండటం, బ్యాక్ డ్రాప్‌లో పెద్ద భవనమ్ కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
భవనమ్ సినిమాకు 'ది హాంటెడ్ హౌస్' అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ చిత్రం టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్‌తో పాటు హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎగ్జయిటింగ్ కంటెంట్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దారని టీజర్ చూస్తే తెలుస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి.. పాత్రలన్నీ హిలేరియస్‌గా ఉంటూనే థ్రిల్‌ని పంచాయి. మూవీ నేపథ్య సంగీతం బ్రిలియంట్‌గా ఉంది.
బీజీఎమ్ హారర్‌ని ఎలివేట్ చేసింది. విజువల్స్, నిర్మాణం విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్, టెర్రిఫిక్ టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రంలో గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్, ప్రభాకర్ (బాహుబలి ఫేమ్), క్రాంతి, హాన్విక, హారిక, మణిచందన, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. మురళీమోహన్ రెడ్డి ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా వరతై ఆంటోని ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
సమ్మర్ స్పెషల్‌గా మే లో భవనమ్ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, స్నేహ ఉల్లాల్ మొదట హిందీలో లక్కీ అనే మూవీతో డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేశాడు. అనంతరం తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో 2008లో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కరెంట్, నేను మీకు తెలుసా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకుంది.
అంతేకాకుండా అలా మొదలైంది, సింహా సినిమాల్లో సైతం సైడ్ క్యారెక్టర్స్‌తోపాటు హీరోయిన్‌గా చేసింది. అయితే, ఊహించిన స్థాయిలో హీరోయిన్‌గా స్టార్ డమ్ అందుకోని స్నేహ ఉల్లాల్ అనంతరం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత భవనమ్ వంటి హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది.