తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ka Ott: ఫాంటసీ థ్రిల్లర్ ‘క’ సినిమాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌లకి ఛాలెంజ్ విసిరిన కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్

KA OTT: ఫాంటసీ థ్రిల్లర్ ‘క’ సినిమాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌లకి ఛాలెంజ్ విసిరిన కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్

Galeti Rajendra HT Telugu

02 December 2024, 8:00 IST

google News
  • KA OTT Streaming: ఓటీటీలోకి లక్కీ భాస్కర్, క సినిమా ఒకే రోజు వచ్చాయి. కానీ.. లక్కీ భాస్కర్‌ని పైరసీ చేసిన వాళ్లు క మూవీని మాత్రం పైరసీ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే? 

ఓటీటీలో క మూవీ అరుదైన ఘనత
ఓటీటీలో క మూవీ అరుదైన ఘనత

ఓటీటీలో క మూవీ అరుదైన ఘనత

OTT platform ETV Win: ఓటీటీలో మూవీని స్ట్రీమింగ్‌కి ఉంచడం ఆలస్యం.. నిమిషాల వ్యవధిలోనే పైరసీ చేసేసి ప్రైవేట్ వెబ్‌సైట్లలో పెట్టేస్తున్నారు. ఓటీటీలో పేరుగాంచిన ప్లాట్‌ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ సైతం ఈ పైరసీని అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి. కానీ.. కొన్ని నెలల క్రితం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈటీవీ విన్.. ఈ ప్లాట్‌ఫామ్‌లకి కొత్త దారి చూపుతూ ఓ ఛాలెంజ్‌ని ముందు ఉంచింది.

లక్కీ భాస్కర్ వచ్చేసినా..

కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ‘క’ సినిమా ఓటీటీ హక్కుల్ని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ ఈటీవీ విన్.. గత గురువారం ఈ మూవీని స్ట్రీమింగ్‌కి ఉంచింది. వాస్తవానికి అదే రోజు లక్కీ భాస్కర్ మూవీని కూడా నెట్‌ప్లిక్స్‌ స్ట్రీమింగ్‌కి ఉంచింది. అయితే.. లక్కీ భాస్కర్ పైరసీ అయిపోయి.. ప్రైవేట్ వెబ్‌సైట్లలో వచ్చేయగా ‘క’ మూవీని మాత్రం పైరసీ చేయలేకపోయారు.

సోషల్ మీడియాలో క పైరసీ గురించి జోరుగా చర్చ కూడా జరిగింది. ఎవరికైనా ఈ మూవీ లింక్ దొరికి ఉంటే.. షేర్ చేయరా ప్లీజ్ అంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టడం గమనార్హం. ఇలా ఓ మూవీ పైరసీ నుంచి తప్పించుకోవడం చాలా అరుదు. దాంతో దేశ వ్యాప్తంగా ఈటీవీ విన్‌ గురించి చర్చ జరిగింది.

ఈటీవీ విన్‌కి భారీగా వ్యూయర్‌షిప్

పైరసీ బెడద లేకపోవడంతో ‘క’ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో సూపర్ సక్సెస్‌గా నిలిచింది. అతి తక్కువ టైమ్‌లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్‌షిప్‌తో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో ఈ మూవీని ఈటీవీ విన్‌ స్ట్రీమింగ్‌కి తీసుకురాగా.. ప్రేక్షకులు కూడా థ్రిల్‌ ఫీల్ అవుతున్నారు. క సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడీగా నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ మూవీని నిర్మించగా.. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.

25 మందితో టీమ్

దీపావళి రోజున విడుదలైన క సినిమా పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో హిట్‌గా నిలిచింది. దాంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో పైరసీని అడ్డుకునేందుకు 25 మంది టీమ్‌తో ఈటీవీ విన్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసింది. దాంతో అనధికార డౌన్‌లోడ్, పైరసీ వెబ్‌సైట్స్‌లో ఈ మూవీ కనిపించలేదు.

దారి చూపిన ఈటీవీ విన్

గత కొంతకాలంగా పైరసీ పెరిగిపోయినా.. ఈ పనిని అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ప్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లాంటి దిగ్గజ ఓటీటీ సంస్థలు కూడా చేయలేకపోయాయి. ఇప్పుడు క సినిమా ద్వారా ఈటీవీ విన్.. ఆ ఓటీటీ సంస్థలకి ఛాలెంజ్ విసిరినట్లే. కోట్లాది రూపాయలు వెచ్చించి ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిన సినిమాలు పైరసీ అవుతున్నా.. చూస్తూ ఉన్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఈటీవీ విన్ బాటలో నడిచే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం