Kiran Abbavaram OTT: ఓటీటీలోకి ఆ టెక్నాలజీతో వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా ఇదే.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్
Kiran Abbavaram About KA OTT Response: హీరో కిరణ్ అబ్బవరం చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న సినిమా క. పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన క ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన క బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Kiran Abbavaram About KA OTT Technology: చాలా కాలం గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం సినీ కెరీర్‌లో ఓ హిట్ పడింది. రాజావారు రాణివారు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి రెండు సినిమాలు హిట్ కావడంతో కిరణ్ అబ్బవరంకు మంచి పాపులారిటీ వచ్చింది.
అడ్వెంచర్ థ్రిల్లర్‌గా
అయితే, ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ చెప్పుకునేంతగా కిరణ్ అబ్బవరంకు హిట్ పడలేదు. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూసిన కిరణ్ అబ్బవరంకు క మూవీతో మంచి సక్సెస్ వచ్చింది. పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన క మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.
క ఓటీటీ స్ట్రీమింగ్
దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకున్న క మూవీ నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న క రెండ్రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్‌షిప్ సాధించి ఓటీటీలోనూ హిట్‌గా నిలిచింది.
పైరసీ అనేది జరగకుండా
ఈ నేపథ్యంలో క బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "క సినిమాకు మేము ఎంతగా ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ టీమ్ అంతా అంతే ప్రమోషన్ చేసి ఆడియెన్స్కు సినిమా బాగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి క సినిమాను చేర్చారు" అని అన్నాడు.
సౌండ్, విజువల్స్ మరింతగా
"ఈటీవీ విన్ టీమ్ బాపినీడు గారు, సాయి కృష్ణ ఇతర అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క కావడం విశేషం. అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్‌గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.
ఈటీవీ విన్‌లో మరోసారి
"థియేటర్‌లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్‌లో చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించింది అని చాలామంది చెబుతున్నారు. క సినిమా సక్సెస్‌కు మా ప్రొడ్యూసర్ గోపి గారు, డైరెక్టర్స్ సందీప్, సుజీత్, డిస్ట్రిబ్యూటర్ వంశీ గారు.. ఇలా ప్రతి ఒక్కరూ కారణం. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని క సినిమా ఇచ్చింది" అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.
మరింత ఎఫెక్టివ్‌గా
"థియేటర్స్‌లో క మూవీకి ఇచ్చిన ఘన విజయాన్ని ఈటీవీ విన్ ఓటీటీలో కూడా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా మూవీ మరింత ఎఫెక్టివ్‌గా మీకు సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది" అని క డైరెక్టర్స్‌లో ఒకరైన సందీప్ తెలిపారు.