తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు

Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు

23 December 2024, 20:10 IST

google News
    • Telugu Movies: హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది తెలుగు చిత్రాలు ఆధిపత్యం చూపాయి. పుష్ప 2 చిత్రం ఏకంగా ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. మూరో మూడు సినిమాలు కూడా హిందీలో అదరగొట్టాయి. ఆ వివరాలివే..
Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు
Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు

Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు

బాలీవుడ్ బాక్సాఫీస్‍ను ఈ ఏడాది 2024లో తెలుగు సినిమాలు షేక్ చేశాయి. గతేడాది సలార్ మినహా తెలుగులో పెద్దగా పాన్ ఇండియా చిత్రాలు రాలేదు. హిందీలో ఆ మూవీ ఒక్కటే అదగొట్టింది. అయితే, ఈ ఏడాది మళ్లీ బాలీవుడ్‍లో తెలుగు చిత్రాలు హవా చూపాయి. పుష్ప 2: ది రూల్ ఏకంగా హిందీ కలెక్షన్ల విషయంలో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. అన్ని బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాలీవుడ్‍లో అగ్రస్థానంలో నిలిచింది. కల్కి 2898 ఏడీ, దేవర, హనుమాన్ సినిమాలు కూడా హిందీలో కలెక్షన్లలో అదరగొట్టాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పుష్ప 2

ఫుల్ క్రేజ్‍తో వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేస్తోంది. హిందీ ఇండస్ట్రీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 తెలుగు కంటే హిందీలో రెట్టింపు కలెక్షన్లను ఇప్పటి వరకు దక్కించుకుంది.

పుష్ప 2 ఇప్పటి వరకు రూ.680 కోట్ల హిందీ నెట్‍ కలెక్షన్లు దక్కించుకుంది. హిందీ నెట్‍ వసూళ్ల విషయంలో ‘స్త్రీ 2’కు కూడా వెనక్కి నెట్టి ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. ఇంకా జోరుగా కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరోకు సాధ్యం కాని రూ.700కోట్ల హిందీ నెట్ కలెక్షన్ల మార్కును అల్లు అర్జున్ సాధించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఇప్పటి వరకు సుమారు రూ.1,600 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇంకా జోరు చూపిస్తోంది. పుష్పకు సీక్వెల్‍గా భారీ అంచనాలతో వచ్చిన పుష్ప 2 దుమ్మురేపింది. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు.

కల్కి 2898 ఏడీ

బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో బాలీవుడ్‍ను షేక్ చేసేసిన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది మరోసారి హిందీలో తన సత్తాచాటారు. గతేడాదిలోనూ సలార్‌తో దుమ్మురేపగా.. ఈ సంవత్సరం కల్కి 2898 ఏడీ చిత్రంతో బాలీవుడ్‍ ప్రేక్షకులను వావ్ అనిపించారు. హిందీలో ఈ మూవీ సుమారు రూ.295కోట్ల నెట్‍ కలెక్షన్లను దక్కించుకుంది. బ్లాక్‍బస్టర్ కొట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఈ ఏడాది జూన్ 27వ తేదీన విడుదలైంది. వరల్డ్ వైడ్‍గా కల్కి 2898 ఏడీ చిత్రం సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది.

దేవర

ఆర్ఆర్ఆర్ చిత్రంతో హిందీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా పాపులర్ అయ్యారు. దేవరతో ఈ ఏడాది మంచి హిట్ కొట్టారు. సోలో హీరోగా ఎన్టీఆర్‌కు ఇదే తొలి పాన్ ఇండియా రేంజ్ మూవీగా పరిగణించవచ్చు. దేవర చిత్రం హిందీలో సుమారు రూ.65కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ రేంజ్‍లో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా మంచి వసూళ్లే దక్కించుకుంది. ఓవరాల్‍గా దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.510 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

హనుమాన్

తక్కువ బడ్జెట్‍తో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‍తోనే రూపొందింది. ఈ మూవీ ఒక్క హిందీలోనే సుమారు రూ.54కోట్ల నెట్‍ వసూళ్లను దక్కించుకుంది. పెద్ద స్టార్స్ లేకపోయినా కంటెంట్‍తో అదిరిపోయే హిట్ సాధించింది. ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ జై కొట్టారు. హనుమాన్ చిత్రం జనవరి 12న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఈ చిత్రం దక్కించుకుంది. భారీ బ్లాక్‍బస్టర్ అయింది.

తదుపరి వ్యాసం