Kanguva Director: కంగువ డైరెక్టర్ చేసిన తెలుగు మూవీస్ ఇవే - ఒకటి యావరేజ్ - రెండు డిజాస్టర్స్!
27 October 2024, 18:39 IST
Kanguva Director: సూర్య కంగువ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్‌గా శివ కెరీర్ టాలీవుడ్‌లోనే మొదలైంది.
కంగువ డైరెక్టర్
Kanguva Director: సూర్య హీరోగా నటిస్తోన్న కంగువ మూవీ నవంబర్ 14న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా కంగువ రికార్డ్ క్రియేట్ చేసింది.
సూర్య డ్యూయల్ రోల్...
కంగువ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. పోరాటయోధుడైన గిరిజన తెగ నాయకుడిగా, ఫ్రాన్సిస్ అనే ఆధునిక యువకుడిగా కనిపించాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. సూర్య సోదరుడు కార్తి గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు సినిమాతోనే...
కంగువ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. శివ కెరీర్‌లో ప్రతిష్టాత్మక మూవీగా కంగువ తెరకెక్కుతోంది. డైరెక్టర్‌గా శివ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. గోపీచంద్ హీరోగా 2008లో వచ్చిన శౌర్యం మూవీతో శివ దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ఏడాది మరోసారి గోపీచంద్‌తోనే శంఖం మూవీని తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు యాక్షన్ అంశాలు జోడించి తెరకెక్కించిన ఈ రెండు సినిమాల్లో శౌర్యం యావరేజ్‌గా నిలవగా...శంఖం డిజాస్టర్ అయ్యింది.
21 ఏళ్ల తర్వాత...
శౌర్యం సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించగా...శంఖం మూవీలో త్రిష కథానాయికగా కనిపించింది. బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన సత్యరాజ్ శంఖం మూవీతోనే టాలీవుడ్‌లోకి 21 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.
రవితేజతో దరువు...
గోపీచంద్ సినిమాల తర్వాత రవితేజతో దరువు సినిమా చేశాడు శివ. యముడి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రవితేజ కామెడీ టైమింగ్ బాగున్నా కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఈ మూవీని పట్టించుకోలేదు.
విక్రమార్కుడు రీమేక్...
రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ విక్రమార్కుడును సిరుత్తై పేరుతో తమిళంలోకి రీమేక్ చేశాడు శివ. ఈ రీమేక్‌లో కార్తి హీరోగా నటించాడు. ఈ మూవీతో శివ పేరు సిరుత్తై శివగా మారిపోయింది. తమిళంలో వరుసగా అజిత్‌తో నాలుగు సినిమాలు చేయడం శివ కెరీర్‌ను మలుపుతిప్పింది. వీరం, వేదాళం, విశ్వాసం, తో పాటు వివేగం సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. రజనీకాంత్‌తో అన్నాత్తే చేసిన అంతగా ఆడలేదు.
నేనున్నానుతో సినిమాటోగ్రాఫర్...
డైరెక్టర్ కావడానికంటే ముందు సినిమాటోగ్రాఫర్‌గా కూడా కొన్ని తెలుగు సినిమాలకు శివ పనిచేశారు. నాగార్జున నేనున్నానుతో టాలీవుడ్‌లోకి సినిమాటోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున మరో మూవీ బాస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు. నవదీప్ హీరోగా నటించిన గౌతమ్ ఎస్ఎస్‌సి, మానసు మాట వినదు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు.