Suriya Kanguva: కంగువ‌ టార్గెట్ రెండువేల కోట్లు - రాజ‌మౌళి స్ఫూర్తితో సినిమా చేశాం - హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-suriya says kanguva movie made with inspiration of director ss rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva: కంగువ‌ టార్గెట్ రెండువేల కోట్లు - రాజ‌మౌళి స్ఫూర్తితో సినిమా చేశాం - హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Suriya Kanguva: కంగువ‌ టార్గెట్ రెండువేల కోట్లు - రాజ‌మౌళి స్ఫూర్తితో సినిమా చేశాం - హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 25, 2024 10:13 AM IST

Suriya Kanguva: కంగువ క‌లెక్ష‌న్స్‌పై హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కంగువ రెండు వేల కోట్ల క‌లెక్ష‌న్స్ సాధిస్తుందా అంటూ అడిగిన ప్ర‌శ్న‌కు పెద్ద‌గా క‌ల‌లు క‌న‌డం నేర‌మా అంటూ స‌మాధాన‌మిచ్చాడు. కంగువ మూవీ చేయ‌డానికి రాజ‌మౌళి స్ఫూర్తి అని సూర్య అన్నాడు.

సూర్య కంగువ
సూర్య కంగువ

Suriya Kanguva: కంగువ క‌లెక్ష‌న్స్‌పై హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కంగువ తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి హీరో సూర్య‌తో పాటు డైరెక్ట‌ర్ శివ‌, ప్రొడ్యూస‌ర్ జ్ఞాన‌వేళ్‌రాజా అటెండ్ అయ్యారు.

ఈ ఈవెంట్‌లో కంగువ క‌లెక్ష‌న్స్‌పై హీరో సూర్య చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. కంగువ కోలీవుడ్‌లో ఫ‌స్ట్ రెండు వేల కోట్లు సాధించే మూవీ అవుతుంద‌ని నిర్మాత చెబుతున్నారు...దీనిపై మీరేమంటారు అని సూర్య‌ను పాత్రికేయులు అడ‌గ్గా...పెద్ద క‌ల‌లు క‌న‌డం ఏమైనా నేర‌మా అంటూ సూర్య స‌మాధాన‌మిచ్చాడు. ఒక‌వేళ నిజంగా సినిమా రెండు వేల కోట్లు క‌లెక్ట్ చేస్తే అంద‌రికి సంతోష‌మేన‌ని సూర్య పేర్కొన్నారు

సినిమా వ‌చ్చి రెండేళ్లు...

“నా సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై రెండేళ్లు దాటింది. అయినా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు తెలుగు ఆడియెన్స్ చూపించిన ఆద‌ర‌ణ చూసి భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా ఆడియెన్స్‌కు లార్జ‌ర్‌దేన్ లైఫ్‌ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే 'కంగువ' లాంటి గొప్ప సినిమా చేశాను. అందుకే రెండున్నరేళ్ల టైమ్ తీసుకుని మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీని చేశాం” అని సూర్య అన్నాడు.

రాజ‌మౌళి స్ఫూర్తి...

కంగువ సినిమా చేయ‌డానికి రాజ‌మౌళి త‌న‌కు స్ఫూర్తినిచ్చార‌ని సూర్య అన్నాడు. “రాజ‌మౌళి త‌న సినిమాల‌తో మాకు దారి చూపించారు. కంగువ స్ట్రైట్ తెలుగు సినిమా. ఇండియన్ సినిమా. అన్ని భాష‌ల ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇది ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు శివ కంగువ సినిమాను తెర‌కెక్కించాడు. న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యతగా భావించి కంగువ సినిమా చేశా” అని సూర్య తెలిపాడు

నా సినిమా చూసి ఐపీఎస్ అయ్యాడు...

“నటుడిగా కమల్ హాసన్ గారిని చూసి ఇన్స్ పైర్ అవుతుంటా. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా కాక కాక సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. జైభీమ్ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. కంగువ కోసం ప్రతి రోజూ 3 వేల మంది వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఇంత గొప్ప సినిమా తయారైంది” సూర్య చెప్పాడు

మ‌ర్చిపోలేని ఎక్స్‌పీరియ‌న్స్‌...

"బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింద‌ని సూర్య పేర్కొన్నాడు. ఆయన సమయపాలన, హార్డ్ వర్క్, ప్యాషన్ చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది" అని సూర్య పేర్కొన్నాడు.

కంగువ మూవీలో దిశాప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. యానిమ‌ల్ ఫేమ్ బాబీడియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ఈ సినిమాలో సూర్య సోద‌రుడు, త‌మిళ హీరో కార్తి గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో కంగువ మూవీ తెర‌కెక్కుతోంది.

Whats_app_banner