Comedy Thriller OTT: ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Comedy Thriller OTT: శ్రీవిష్ణు స్వాగ్ మూవీ థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజైంది.
Comedy Thriller OTT: శ్రీవిష్ణు హీరోగా నటించిన టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్వాగ్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ విడుదలైంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
రీతూ వర్మ...మీరా జాస్మిన్...
స్వాగ్ మూవీకి హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మీరాజాస్మిన్, దక్షా నగార్కర్ , సునీల్ కీలక పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు ఐదు పాత్రల్లో కనిపించగా...రీతూవర్మ, మీరా జాస్మిన్ డ్యూయల్ రోల్స్‌చేశారు.
మిక్స్‌డ్ టాక్...
అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. శ్రీవిష్ణుతో పాటు రీతూవర్మ నటనకు ప్రశంసలు దక్కాయి. కాన్సెప్ట్ బాగున్నా కన్ఫ్యూజింగ్‌గా దర్శకుడు స్క్రీన్‌పై ఆవిష్కరించాడనే నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా నిర్మాతలకు స్వాగ్ మూవీ లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
ఎనిమిది కోట్ల వరకు స్వాగ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతోన్నారు. థియేట్రికల్ రన్‌లో ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.. ఓటీటీ, శాటిలైట్ డీల్‌తో ప్రొడ్యూసర్స్ సేఫ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
శ్వాగణిక వంశస్థుల కథ...
భవభూతి (శ్రీవిష్ణు) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. గొడవల కారణంగా భార్య రేవతి (మీరా జాస్మిన్) అతడికి దూరంగా వెళ్లిపోతుంది. శ్వాగణిక వంశ వారసత్వానికి సంబంధించి భవభూతికి ఓ లెటర్ వస్తుంది.
కోట్ల రూపాయల ఆస్తి కోసం వంశ వృక్ష నిలయానికిభవభూతితో అలాంటి లెటర్స్‌తోనే సింగ(శ్రీవిష్ణు), అనుభూతి ( రీతూ వర్మ) కూడా వస్తారు.. వారికి ఈ లేఖలు పంపించిన విభూతి(శ్రీవిష్ణు) ఎవరు? ఈ ముగ్గురిలో శ్వాగణిక ఆస్తి ఎవరికి దక్కింది? భవభూతి, సింగ ఆస్తి దక్కకూడదని యయాతి (శ్రీవిష్ణు) ఎందుకు అనుకున్నాడు?
1551 ఏళ్ల క్రితం పురుషులపై ఆధిపత్యం చెలాయించిన వింజమర వంశ రాణి రుక్మిణి దేవి (రీతూ వర్మ) కథేమిటి? పితృస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి శ్వాగణిక మూలపురుషుడు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? ఈ కథలోకి విభూతి ఎలా వచ్చాడు? శ్వాగణిక వంశ నిధి చివరకు ఎవరికి దక్కింది? అన్నదే స్వాగ్ మూవీ కథ.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
స్వాగ్ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్‌పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. స్వాగ్ కంటే ముందు శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో రాజా రాజా చోర అనే మూవీ వచ్చింది.