తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aa Ammayi Gurinchi Meeku Cheppali In Ott: ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు చిత్రం.. ఎందులో అంటే?

Aa Ammayi Gurinchi Meeku Cheppali in OTT: ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు చిత్రం.. ఎందులో అంటే?

04 October 2022, 19:06 IST

    • aa ammayi gurinchi meeku cheppali ott: సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కాస్త ముందుగానే ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Twitter)

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Aa Ammayi Gurinchi Meeku Cheppali OTT Release: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. ఆయన నటించిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వైవిధ్య చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమాను ఓటీటీలో కాస్త ముందుగానే రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం అక్కడ స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 5న విజయదశమి కానుకగా ఓ రోజు ముందుగానే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని హీరో సుధీర్ బాబు ట్విటర్ వేదికగా తెలియజేశారు.

అందమైన ప్రేమకథలను రూపొందించడంలో మోహనకృష్ణ ఇంద్రగంటి సిద్ధహస్తుడు. ఆయన నాలుగేళ్ల క్రితం తెరకెక్కించిన సమ్మోహనం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వసూళ్లపరంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నష్టాలను పూడ్చుకునేందుకు ఓటీటీలో విడుదల చేసింది చిత్రబృందం.

ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. సుధీర్ బాబు సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా చేసింది. వీరు కాకుండా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, కునాల్ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం