Sudheer Babu Hunt Teaser: హంట్ టీజ‌ర్ రిలీజ్ - యాక్షన్‌తో అద‌ర‌గొట్టిన సుధీర్‌బాబు-sudheer babu hunt intense and action packed teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudheer Babu Hunt Teaser: హంట్ టీజ‌ర్ రిలీజ్ - యాక్షన్‌తో అద‌ర‌గొట్టిన సుధీర్‌బాబు

Sudheer Babu Hunt Teaser: హంట్ టీజ‌ర్ రిలీజ్ - యాక్షన్‌తో అద‌ర‌గొట్టిన సుధీర్‌బాబు

Nelki Naresh Kumar HT Telugu
Oct 03, 2022 11:49 AM IST

Sudheer Babu Hunt Teaser: సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న హంట్ సినిమా టీజ‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. యాక్ష‌న్ అంశాల‌తో పూర్తిగా స్టైలిష్‌గా ఈ టీజ‌ర్ సాగింది.

<p>సుధీర్‌బాబు</p>
సుధీర్‌బాబు (Twitter)

Sudheer Babu Hunt Teaser: కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి యాక్ష‌న్ క‌థాంశంతో హీరో సుధీర్‌బాబు చేస్తున్న సినిమా హంట్‌. మ‌హేష్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. సోమ‌వారం హంట్‌ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

హి వాజ్ అర్జున్ ఏ..యూ ఆర్ అర్జున్ బీ...అర్జున్ ఏకి తెలిసిన మ‌నుషులు,ఇన్సిడెంట్స్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇవేవీ అర్జున్ బీకి తెలియ‌దు అంటూ సుధీర్ క్యారెక్ట‌ర్‌ను డ్యూయ‌ల్ షేడ్స్‌లో ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిని పంచుతోంది. బ‌ట్ ఐ డోంట్ వాంట్ టూ బీ అర్జున్ బీ...ఐ వాంట్ టూ గెట్ బ్యాక్ అర్జున్ ఏ అంటూ సుధీర్ చెప్ప‌డం టీజ‌ర్‌లో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది. ఏ కేసునైతే అర్జున్ మొద‌లుపెట్టి సాల్వ్ చేయ‌లేక‌పోయాడో అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

పూర్తిగా యాక్ష‌న్ సీక్వెన్స్‌తో టీజ‌ర్ ఇంటెన్స్‌గా సాగింది. సుధీర్‌బాబుపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు, ఛేజింగ్ ఎపిసోడ్స్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌నిపించ‌ని శ‌త్రువు కోసం ఓ పోలీస్ ఆఫీస‌ర్ సాగించే అన్వేష‌ణ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంద‌ని ద‌ర్శ‌కుడు మ‌హేష్ చెబుతున్నారు.

హంట్ సినిమాలో సీనియ‌ర్ హీరో శ్రీకాంత్‌తో పాటు ప్రేమిస్తే భ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హంట్ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుతున్నారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వి. ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Whats_app_banner