SSMB28 New Poster: ఎస్ఎస్ఎంబీ28 కొత్త పోస్టర్ అదిరిపోయింది
29 May 2023, 16:56 IST
- SSMB28 New Poster: ఎస్ఎస్ఎంబీ28 కొత్త పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీ టైటిల్ లాంచ్ కు రెండు రోజుల ముందు మేకర్స్ ఈ కొత్త పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.
ఎస్ఎస్ఎంబీ28 నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఇదే
SSMB28 New Poster: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28 టైటిల్ లాంచ్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. బుధవారం (మే 31) ఈ మూవీ టైటిల్ రివీల్ చేయనుండగా.. తాజాగా సోమవారం (మే 29) కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయాలని నిర్ణయించారు.
దానికి కౌంట్ డౌన్ కోసమంటూ ఈ కొత్త పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మాస్ స్ట్రైక్ అంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ తన మోకాలిపై కూర్చొని నేలను ముద్దాడుతుండటం చూడొచ్చు. ఈ పోస్టర్ మూవీ టైటిల్ పై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇది కావచ్చు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
టైటిల్ విషయంలో ఇప్పటికే అమరావతికి అటు ఇటు, ఆరంభం, హాట్ మిర్చి తదితర పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు గుంటూరు కారం అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ మహేష్ బాబుకు కూడా బాగా నచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా అభిమానులకు కూడా మూవీకి టైటిల్ మంచి యాప్ట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
ఎక్కువ మందికి ఈ టైటిల్ నచ్చగా.. మరి త్రివిక్రమ్‌కు నచ్చుతుందో చూడాలి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలకు ఎక్కువగా అ అనే పేరుమీదుగా స్టార్ట్ అవుతాయి. అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా చాలా వరకు అ అక్షరంతోనే మొదలవుతాయి. మరి మహేష్ మూవీకి గుంటూరు కారం ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.
త్రివిక్రమ్ తన సొంత సెంటిమెంటును కాదని గుంటూరు కారం టైటిల్‌ను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ టైటిల్‌ను బట్టి చూస్తే గుంటూరు నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.