Pooja Hegde : పూజా హెగ్డేను చేసుకునేవాడికి ఈ క్వాలిటీస్ ఉండాలట
Pooja Hegde Marriage : పూజా హెగ్డే బిజీబిజీగా ఉంటోంది. హిట్,ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలట. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే చెబుతున్నారు.
పూజా హెగ్డే(Pooja Hegde) కెరీర్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. కిందటి ఏడాది డిజాస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ తో ఫ్లాప్ అందుకుంది. బాలీవుడ్(Bollywood) లో మరికొన్ని సినిమాలు చేస్తోంది. షాహిద్ కపూర్ సరసన కోయి సాక్ మూవీలో నటిస్తోంది. ఇక తెలుగులో మహేష్-త్రివిక్రమ్ తో SSMB28 క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో సల్మాన్-పూజా హెగ్డే మధ్యలో అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. ఇదంతా రూమర్స్ మాత్రమేనని ఇద్దరూ కొట్టిపారేశారు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేని పూజా హెగ్డేను కట్టుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆమె తల్లి చెప్పింది. మదర్స్ డే సందర్భంగా పూజా హెగ్డే, ఆమె తల్లికి మధ్యలో జరిగిన చర్చని పూజా వీడియో రూపంలో షేర్ చేసింది.
పూజా హెగ్డే ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుంది అంటే.. తనని అన్ని రకాలుగా అర్ధం చేసుకునే మనిషిని ఇష్టపడుతుందట. తనని బాగా ఇష్టపడే వ్యక్తి కోసం ఆమె ఎదురు చూస్తుందట. 'వివాహ బంధం అనేది కలకాలం నిలిచే బంధం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అర్థం చేసుకోవాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం వేస్ట్. ఆ బంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదు. పూజా హెగ్డే చాలా సెన్సిటివ్, తనని బాగా చూసుకోవాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కెరీర్ ని ఎంకరేజ్ చెయ్యాలి. అలాంటి అబ్బాయి కావాలని పూజా హెగ్డే కోరుకుంటుంది.' అని ఆమె తల్లి చెప్పింది.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబుతో సినిమా చేస్తోంది. పూజా హెగ్డే.. మహేష్ బాబుతో(Pooja Hegde-Mahesh babu) కలిసి ఇప్పటికే మహర్షి సినిమాలో నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SSMB28లోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో పూజాతో పాటు సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్‌గా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
టాపిక్