SSMB28 Shooting: మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్.. ప్రారంభమైన ఎస్ఎస్ఎంబీ28 కొత్త షెడ్యూల్
SSMB28 Shooting: మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్ తో తన కొత్త మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబీ28 మూవీ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.
SSMB28 Shooting: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాది మహేష్ కొత్త సినిమా కొత్త షెడ్యూల్ ఘనంగా ప్రారంభమైంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరో మహేష్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ మధ్యే ఎస్ఎస్ఎంబీ 28 టీమ్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇక ఇప్పుడీ మూవీ మరో షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ బాబుపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. మార్చి 30 వరకు ఏకధాటిగా షూటింగ్‌ను జరుపనున్నట్లు తెలిసింది.
ఈ షెడ్యూల్‌లో మహేష్‌బాబు, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. మరోవైపు షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకొంది. ఈ సినిమా డిజిటల్‌రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
ఇక ఈ ఎస్ఎస్ఎంబీ 28కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాను రానున్న వేసవిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. గతేడాది కృష్ణ మరణంతో మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు నిలిచిపోయింది. దీంతో రిలీజ్ డేట్ ను వేసవి నుంచి ఆగస్ట్ నెలకు మార్చాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం